ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ద్వారా 1875 గ్రాడ్యుయేట్లతో ఓట్లను ఉచితంగా ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించింది. పట్టభద్రుల ఓటింగ్ శాతం పెరగాలనే సామాజికసేవా దృక్పదంతో ఈసేవను చేపట్టింది. రెండు కంప్యూటర్లు, ఒక ఇంటర్నెట్ డివైజ్, ఇద్దరు ఆపరేటర్లను విని యోగించి ఈఉచిత సేవచేసింది. ఓట్లు వెతుక్కోవడానికి ఇబ్బంది పడిన వారందరికీ 9490280270, 9390280270 నెంబర్ల ద్వారా ఓటును వెబ్ సైట్ లో వెతికి, వారికి పోలింగ్ స్టేషన్లు, బూత్ నెంబర్ల వివరాలను తెలియజేసింది. ఎన్నికల సంఘం వెబ్ సైట్ అడ్రస్ ను కూడా విశేషంగా ఈఎన్ఎస్ లైవ్ యాప్, www.enslive.net ద్వారా ప్రచారం చేసింది. ఈ విధానం ద్వారా సుమారు 4100 మందికి వారి యొక్క ఓట్లను ఎన్నికల సంఘం వెబ్ సైట్ ద్వారా వెతికి స్క్రీన్ షాట్ల రూపంలో పంపి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు తెలియజేయడంలో ప్రత్యేక భూమిక వహించి తనవంతు సేవను పట్టభద్రులకు విశేషంగా అందించింది.