1 ENS Live Breaking News

2021-01-01 09:15:16

2020-12-27 21:05:10

2020-12-25 09:27:05

2020-12-20 15:55:34

ఎస్టీఐ డిక్లరేషన్ 2020కి బ్రిక్స్ ఏకగ్రీవ ఆమోదం..

బ్రిక్స్ గ్రూపింగ్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) యొక్క సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ మంత్రులు నవంబర్ 13 సాయంత్రం వర్చువల్ ప్లాట్‌ఫామ్ ద్వారా జరింగింది. ఈ సమావేశం ద్వారా సభ్య దేశాల మధ్య ఎస్ & టి సహకారం గురించి చర్చించారు. రష్యా సైన్స్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ మంత్రిత్వ శాఖ ఈ సమావేశాన్ని నిర్వహించింది, రష్యన్ ఫెడరేషన్ 12 వ బ్రిక్స్ సమ్మిట్ కు అధ్యక్ష స్థానం వహిస్తోంది. ఈ సమావేశంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక, ఎర్త్ సైన్సెస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ముగింపు సభలో పాల్గొన్న ప్రముఖులను అభినందించారు, “బ్రిక్స్ ఎస్టీఐ డిక్లరేషన్ 2020,  బ్రిక్స్ కార్యకలాపాల క్యాలెండర్ 2020-21 మన సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి రోడ్‌మ్యాప్‌గా ఉంటాయని” సమావేశంలో బ్రిక్స్ ఎస్టీఐ డిక్లరేషన్ 2020 ను ఏకగ్రీవంగా ఆమోదించారు.  "సమగ్ర అభివృద్ధి కోసం ఇన్నోవేషన్ డిక్లరేషన్లో ముఖ్యమైన ప్రస్తావన ఉంది" అని కేంద్ర శాస్త్ర సాంకేతిక, ఎర్త్ సైన్సెస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ అన్నారు. "సంప్రదింపులు, పరస్పర జ్ఞాన భాగస్వామ్యం, సామర్థ్యం పెంపొందించడం, క్రాస్ ఇంక్యుబేషన్ తో ప్రోత్సహించడానికి బ్రిక్స్ దేశాలతో పరస్పర చర్చ చేయాల్సిన ఆవశ్యకతను మేము గుర్తించాము.” అని వివరించారు. ఈ సందర్భంగా  బ్రిక్స్ సభ్యుల నాయకులు భారతదేశాన్ని ప్రశంసించారు, “ఆర్ అండ్ డి కార్యకలాపాలను చేపట్టడానికి అభివృద్ధి చెందుతున్న, ప్రముఖ మహిళా పరిశోధకులను ప్రోత్సహించడానికి, మద్దతు ఇవ్వడానికి 'సెర్బ్-పవర్' (అన్వేషణాత్మక పరిశోధనలో మహిళలకు అవకాశాలను ప్రోత్సహించడం) అనే పథకాన్ని మేము ఇటీవల ప్రారంభించాము. సైన్స్ మరియు ఇంజనీరింగ్ యొక్క సరిహద్దు ప్రాంతాలలో. ప్రత్యేకమైన వేదిక మరియు యంత్రాంగం ద్వారా బ్రిక్స్ మహిళా శాస్త్రవేత్తలను నెట్‌వర్కింగ్ గురించి మేము ఆలోచిస్తున్నాము" అని కేంద్ర మంత్రి తెలిపారు. 

New Delhi

2020-11-14 17:29:40

హెచ్ 1బి వీసాలకు లైన్ క్లియర్ చేస్తా..బైడన్

అగ్రరాజ్యం నూతన అధ్యక్షుడు అమెరికాను సాఫ్ట్ వేర్ రంగంలో ప్రపంచ అగ్రమామిగా మార్చేందుకు వినూతన్న నిర్ణయం తీసుకున్నారు. ఇలా గెలిచిన వెంటనే  బైడెన్. హెచ్ 1బి వీసాల పరిమితిని పెంచుతామని హామీ ఇచ్చారు. తద్వారా మరింతమంది సాఫ్ట్ వేరు ఉద్యోగులు అగ్రరాజ్యానికి వెళ్లేందుకు మార్గం సుగమం కాబోతుంది.. గ్రీన్ కార్డుల కోటాను కూడా త్వరలోనే పెంచుతామని చల్లని వార్త చెప్పారు. అంతేకాదు, హెచ్1బి వీసాలపై వచ్చే ఉద్యోగులు తమ వెంట తమ భార్య లేదా భర్తను తీసుకొచ్చుకునేందుకు కూడా అంగీకారం తెలపనున్నారు. దీంతో అమెరికాలో ఉద్యోగాల కోసం వెళ్లిన, వెళ్తున్న ఎంతో మందికి ఈ నిర్ణయం కొత్త ఊపిరినిచ్చింది. త్వరలోనే ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో మార్పులు చేస్తామని బైడెన్ భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే అమెరికాకు వచ్చే హై స్కిల్డ్ ఉద్యోగుల పట్ల కాస్త సాఫ్ట్ కార్నర్‌తో వ్యవహరిస్తున్నారు కొత్త అమెరికా అధ్యక్షుడు. సుమారు 11 మిలియన్ల వలసదారులకు అంటే కోటి పది లక్షల మందికి అమెరికా సిటిజెన్‌షిప్ ఇస్తామని చెప్పారు బైడెన్. సరైన డాక్యుమెంట్లు లేకపోయినా సరే వాళ్లందరికీ అమెరికా పౌరసత్వం ఇచ్చేలా ఓ రోడ్‌మ్యాప్ రెడీ చేయబోతున్నారు. ఈ నిర్ణయంతో కనీసం 5లక్షల మంది భారతీయులకు ప్రయోజనం కలగనుంది. ఇందుకోసం అతి త్వరలోనే అమెరికా చట్టసభల్లో ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్స్ బిల్లును తీసుకొస్తామన్నారు. వీసా నిబంధనలతో ఉద్యోగులను కుటుంబాలకు దూరం చేయడం తమ అభిమతం కాదని, ఫ్మామిలీ బేస్డ్ ఇమ్మిగ్రేషన్ విధానంతో కొత్త సంస్కరణలు తెస్తామని హామీ ఇచ్చారు. ముస్లిం దేశాలపై విధించిన వీసా బ్యాన్‌ను కూడా ఎత్తేయబోతున్నారు. పైగా ఏడాదికి 95వేల మంది శరణార్ధులకు అమెరికాలో ఆశ్రయం ఇచ్చేలా ఓ విధానాన్ని కూడా రూపొందించబోతోంది బైడెన్ సర్కార్.

వైట్ హైస్, అమెరికా

2020-11-09 10:17:32

వాట్సాప్‌‌లో కొత్త ఫీచర్ ఇదే..!

వాట్సాప్ యూజర్లకు కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ, యాప్ అనిస్టాల్ చేయకుండా కట్టిపడేసేలా చేస్తుంది సంస్థ.. ఈక్రమంలోనే కొత్త అప్‌‌డేట్ తీసుకు వస్తున్నామంటూ వాట్సప్ యూజర్లకు సంస్థ లీకిచ్చింది. ఈ యాప్‌‌లో ‘డిసప్పియరింగ్ మెసేజెస్’ ఫీచర్‌‌ను తీసుకొస్తున్నట్లు  ప్రకటించింది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుంటే వ్యక్తిగత చాట్‌‌తోపాటు గ్రూప్ చాట్స్‌‌లో ఏడు రోజుల తర్వాత మెసేజులు వాటంతటవే డిలీట్ అయిపోతాయి.  ఆండ్రాయిడ్, ఐఓఎస్, లైనక్స్ బేస్డ్ కైఓఎస్ డివైజెస్‌‌తోపాటు వాట్సాప్ వెబ్, డెస్క్‌‌టాఫ్ ప్లాట్‌‌ఫామ్స్‌‌లో ఈ నెలాఖరుకల్లా కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. టెలిగ్రామ్‌‌తో పోల్చుకుంటే వాట్సాప్‌‌లో డిసప్పియరింగ్ ఫీచర్ కాస్త వైవిధ్యంగా ఉండనుంది. టెలిగ్రామ్‌‌లో మెసేజులు ఎప్పుడు డిలీట్ అవ్వాలనే ఆప్షన్‌‌లో గంటలు, రోజుల పరిమితి ఉంటుంది. కానీ వాట్సాప్‌‌లో 7 రోజుల డిసప్పియర్ పీరియడ్ మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ‘మేం ఏడు రోజుల పీరియడ్‌‌తో దీన్ని మొదలుపెడుతున్నాం. ఎందుకంటే తమ సంభాషణలు శాశ్వతం కాదని యూజర్లకు తెలియాలి. దీంతో వాళ్లు తాము ఏం చాటింగ్ చేయాలనే దానిపై స్పష్టతతో ఉంటారు అని చెబుతోంది వాట్సప్. మీరు వెతికే స్టోర్ అడ్రస్, షాపింగ్ లిస్ట్‌ మీకు అవసరం ఉన్నప్పుడు అందుబాటులో ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆటోమెటిక్‌‌గా డిలీట్ అయిపోతుంది’ అని వాట్సాప్ ఓ ప్రకటనలో పేర్కొంది. డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్‌‌ను అన్ని చాట్ విండోలకు ఒకేసారి ఎనేబుల్ చేయలేం. ఏ చాట్ విండోకు ఫీచర్‌ కావాలనుకుంటే ఆ చాట్‌‌లో ఎనేబుల్ చేసుకోవచ్చు అని కూడా వివరించింది..

California

2020-11-06 13:32:31

వ్యాక్సిన్ వచ్చేంత వైరస్ ప్రభావాలు పరిశీలించాలి..

కరోనా వైరస్ కు టీకా వచ్చేంత వరకూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వ్యాధినిరోధక శక్తిని పెంచే విధంగా వైద్యసేవఅ అందించడం ఒక్కటే మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డా.టెడ్రోస్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాకి ఒక వీడియో సందేశాన్ని పంపారు. ఆయన మాటల ప్రకారం కరోనా వైరస్ ఒక్క వ్యాక్సిన్ ద్వారా నియంత్రించడానికి వీలుపడుతుందన్నారు. అంతవరకూ కరోనా లక్షణాలను, వాటి ద్వారా వచ్చే దీర్ఘకాలిక వ్యాధులను కూడా గుర్తించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. అటు డబ్ల్యూహెచ్ ఓ కూడా కరోనా ప్రభావాలను లక్షణాలను గమనిస్తోందన్నారు. వైరస్ సోకిన తరువాత వచ్చే దీర్ఘకాలిక ప్రభావాలను గుర్తించి మందుల ద్వారా నియంత్రించగలిగితే వాక్సిన్ వచ్చిన తరువాత సురక్షితంగ ఉండొచ్చునని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం, దానియొక్క ప్రభావాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, ప్రపంచానికి తెలియజేస్తూ వస్తుందన్నారు..

Geneva

2020-10-31 13:58:12