1 ENS Live Breaking News

కరోనాను నియంత్రణకు జపాన్ సహాయం రూ.5వేల కోట్లు

కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు అత్యవసర సహాయంగా భారత్ కు జపాన్ ప్రభుత్వం అధికారిక అభివృద్ధి సహకార ఋణం కింద  5000  కోట్ల జపాన్ యెన్ లు ( సుమారు రూ.3500 కోట్లు) ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు భారత ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ఆర్థిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి డాక్టర్ సి ఎస్ మొహాపాత్ర, భారత్ లోని జపాన్ రాయబారి సుజుకి సతోషి పత్రాలు మార్చుకున్నారు. ఈ నిధిలను కరోనాపై పోరుకోసం ఆరోగ్యరంగం వినియోగించుకుంటుంది. కరోనా సంక్షోభం మీద పోరాడటంతోబాటు భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్యపరమైన ఉపద్రవాలు ఎదురైనా ఎదుర్కోవటానికి ఈ నిధులు వినియోగిస్తారు. అంటువ్యాధులమీద పోరాటానికి భారత ఆరోగ్య వ్యవస్థ ఈ నిధులను వాడుకుంటుంది.  ఇదే కాకుండా మరో 100  కోట్ల జపాన్ యెన్ లు ( సుమారు రూ. 70 కోట్లు) గ్రాంటు రూపంలో అందించే పత్రాలను కూడా ఆర్థిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి డాక్టర్ సి ఎస్ మొహాపాత్ర, భారత్ లోని జపాన్ రాయబారి సుజుకి సతోషి మార్చుకున్నారు. ప్రజారోగ్యాన్ని, వైద్య వ్యవస్థను పటిష్ఠపరచే వైద్య పరికరాల కొనుగోలుకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో జపాన్ ప్రభుత్వం ఈ మొత్తాన్ని అందజేసింది. దీనివలన కరోనాతో తీవ్రంగా బాధపడుతూ ఉన్న వారికి ఆరోగ్య సదుపాయాలు మరింత మెరుగవుతాయి.  భారత్, జపాన్ మధ్య సయోధ్యకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ద్వైపాక్షికాభివృద్ధి సహకారం 1958 నుంచీ ఉంది. గడిచిన కొన్నేళ్ళలో భారత్, జపాన్ మధ్య ఆర్థిక సహకారం మరింత పటిష్టమై, వ్యూహాత్మక భాగస్వామ్యంగా మారింది. ఇది మరింత బలోపేతమై ఇరుదేశాలమధ్య వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని పటిష్టపరుస్తుంది. కార్యక్రమంలో న్యూఢిల్లీలోని జికా ప్రధాన ప్రతినిధి  కత్సువీ మత్సుమోటో కూడా పాల్గొన్నారు.

Japan

2020-09-01 09:53:33

భారత మార్కెట్ లోకి రెడ్ మి 5జి స్మాన్ ఫోన్..

చైనా మొబైల్ దిగ్గజం షావోమి రెడ్‌మీ 5జీ స్మార్ట్ ఫోన్ ను తొలిసారిగా భారత మార్కెట్లోకి దించడానికి రెడీ అవుతుంది. రెడ్‌మీ కే30 5 జీ భారతదేశంలో త్వరలో దీన్ని లాంచ్ చేయనుంది. గత ఏడాదే  బీఐఎస్ సర్టిఫికేషన్ అందుకున్నప్పటికీ, ఈ ఫోన్ లాంచింగ్ ఆలస్యమవుతూ వస్తుంది. ఇపుడు అన్ని అడ్డంకులూ దాటుకొని  కొద్ది రోజుల్లోనే రెడ్‌మీ తన తొలి 5జీ స్మార్ట్ ఫోన్ ను భారత్ లోని తన వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేసుకుంది.  మొబైల్ మార్కెట్ తాజా నివేదికల ప్రకారం ఈ డెమ్ మీ స్మార్ట్ 5జీ ఫోన్ 6జీబీ, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ, 28 జీబీ స్టోరేజ్  వేరియంట్లలో, ఫ్రాస్ట్ వైట్  మిస్ట్ పర్పుల్ రంగు లలో దింపనుండగా. పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో రెడ్‌మి కె 20 ప్రో మాదిరిగానే ఉండనుందని  మొబైల్ మార్కెట్ అంచా వేస్తుంది. ఇక  రెడ్‌మీ కే30 5జీ  స్పెసిఫికేషన్లు ఒక్కసారి పరిశీలిస్తే...6.67-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే,  1080 x 2400 ఫుల్  హెచ్‌డి + రిజల్యూషన్‌ , క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 జి ప్రాసెసర్‌ ,20+2 మెగాపిక్సెల్   డబుల్ సెల్ఫీ కెమెరా, 64+ 8 +5 + 2 మెగాపిక్సెల్   క్వాడ్ కెమెరా , 4500 ఎంఏహెచ్  బ్యాటరీ ,ధర  :  సుమారు 21,350 రూపాయల నుంచి ప్రారంభం కావొచ్చని తెలు స్తుంది. వీటితోపాటు ఇతర దేశీయ కంపెనీలు కూడా తమ బ్రాండ్ 5జీ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి దించేందకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి...

China

2020-08-31 19:04:39

కీసర తహశీల్దార్ రూ.1.10 కోట్ల విషయం గిన్నిస్ బుక్ లోకి...

ప్రపంచంలోనే రూ..1.10కోట్ల రూపాయలు లంచం తీసుకుని ఏసీబీకి దొరికిపోయిన తెలంగాణలోని కీసర తహశీల్దార్ ఘటనపై గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్పందించింది. 20 మిలియన్ డాలర్ల లంచం ప్రపంచంలో ఇదే ప్రథమమని..పేర్కన్న గిన్నిస్ బుక్ ఈ రికార్డ్ ని నమోదుకు ఆలోచన చేస్తున్నట్టు ప్రకటించింది..ఓ ప్రభుత్వ ఉద్యోగి, దాదాపు 20 మిలియన్ డాలర్లు లంచం స్వీకరిస్తూ, పట్టుబడటం ఇదే తొలిసారని, ఆయన పేరును రికార్డుల్లోకి ఎక్కించాలని కోరుతూ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రెండుస్వచ్చంద సంస్థలు గిన్నిస్ రికార్డు అధికారులను కోరారు. ఇప్పటివరకూ ప్రభుత్వ అధికారుల అవినీతికి సంబంధించిన కేటగిరీ లేదని, దీనికోసం ఓ కొత్త కేటగిరీని ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తామని గిన్నిస్ ప్రతినిధులు తెలియజేశారని జ్వాల సంస్థ ప్రెసిడెంట్ ఎస్.ప్రశాంత్ తెలిపారు. మొత్తానికి లంచం తీసుకోవడంలో తెలంగాణ రాష్ట్రం గిన్నిస్ బుక్ రికార్డు ద్రుష్టిలో పడటం వైరల్ అవుతుంది...

Keesara

2020-08-26 18:52:41

ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌కు బాయ్ బాయ్..!

ఇంటర్నెట్ వినియోగదారులకు మైక్రోసాఫ్ట్ ఒక చేదువార్తను తెలియజేసింది. ఇంతకాలం వినియోగించిన ఇంటర్నెట్ ఎక్సోప్లోలర్ ను వచ్చే ఏడాది నుంచి నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. దానికి కారణం సుమారు 365 యాప్స్ సేవలు దీనికి భవిష్యత్తులో సపోర్టు చేయకపోవడమేనని వివరించింది. వెబ్‌ బ్రౌజర్‌ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ను‌ నిలిపివేయాల్సిన సమయం ఆసన్నమైందని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. దశలవారీగా దీని సేవలను నిలిపివేస్తామని పేర్కొంది. మైక్రోసాఫ్ట్‌ చరిత్రలో ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ది ప్రత్యేక స్థానం. ప్రజలకు అంతర్జాలాన్ని దగ్గర చేసిన ఘనత దీనికే దక్కుతుంది. ఇప్పుడు కంపెనీ తీసుకున్న నిర్ణయంతో  అది కాలగర్భంలో కలిసిపోనుంది. 2021 ఆగస్టు 17 నుంచి ఆఫీస్‌ 365, వన్‌ డ్రైవ్‌, ఔట్‌లుక్‌ వంటివి ఎక్స్‌ప్లోరర్11ను సపోర్టు చేయవని.. ఈ ఏడాది నవంబర్‌ 30 తర్వాత నుంచి తమ టీమ్‌ కూడా అందుబాటులో ఉండదని పేర్కొంది. ఇక ఎడ్జ్‌ లెగస్సీ డెస్క్‌ టాప్‌ యాప్‌కు కూడా వచ్చే మార్చి 9 నుంచి స్వస్తి పలుకుతున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.

Washington

2020-08-19 19:30:00

20–40వ‌య‌సున్న‌ వారి నుంచే అధికంగా కరోనా WHO

కరోనా వ్యాప్తి కారకాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ తాజాగా చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది... 20 నుంచి 40 ఏండ్ల వ‌య‌సున్న‌ వారి ద్వారానే కరోనా వ్యాప్తి అధికంగా జరుగుతోందని డబ్ల్యూహెచ్ఓ వెస్ట్రన్ పెసిఫిక్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ తకేషి కసయి మంగళవారం నాడు తెలిపారు. ఇర‌వై నుంచి న‌ల‌భై ఏళ్ల లోపు వారు తమకు తెలీకుండానే కరోనా బారినపడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. ఆరోగ్యంగానే ఉన్నామనుకుని వివిధ ప్రాంతాల్లో ప్రయాణించడం మూలాల కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని ఆయన చెప్పారు. తమకు కరోనా సోకిందన్న విషయం వీరిలో అనేక మందికి తెలియక పోవడం విశేషమన్నారు. ఈ పరిస్థితి వృద్ధులకు, అనారోగ్యంగా ఉన్నవారికి ఇది పెద్ద ప్రమాదకరంగా మారుతుందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజారోగ్య వ్యవస్థ అందుబాటులో లేని ప్రాంతాలు, జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.

Geneva

2020-08-18 21:00:27

కరోనా వైరస్ టీకా విడుదల విషయంలో రష్యా టాప్..పుతిన్

ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న వేళ కొనసాగుతున్న టీకా రేసును ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న ప్రపంచానికి తొలి ఆశాకిరణం కనిపించింది రష్యా. కరోనా వైరస్‌పై తొలి వ్యాక్సిన్‌ను రష్యా విడుదల చేసింది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మాట్లాడుతూ, తన కుమార్తె టీకా వేయించుకున్నట్టు వెల్లడించారు. దీంతో కరోనా వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేసిన తొలిదేశంగా రష్యా ప్రపంచంలో నమోదు అయినట్టు అయ్యింది. టీకా ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి వైరస్‌ నియంత్రణలోకి వస్తుందని తెలిపిన పుతిన్‌...తొలుత వైద్య సిబ్బంది, ఉపాధ్యాయయులకు ఈ టీకా ఇస్తామన్నారు.  ‘కరోనా వైరస్‌పై టీకా అభివృద్ధి చేసిన  తొలిదేశంగా రష్యా నిలిచింది’ అని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు కీలక ప్రకటన వెలువడింది.  ఈ టీకా సంబంధించిన సమాచారాన్ని తనకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుండాలని ఆయన దేశ ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్‌ మురాస్కోను ఆదేశించడం విశేషం..దీనితో ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ టీకా విషయంలో రష్యా ముందు వరసులో నిలుచున్నట్టు అయ్యింది.

Russia

2020-08-11 20:40:44

గుర్రపు రైళ్లను మీరు ఎపుడైనా చూశారా...అయితే మీకోసమే...

90 సంవత్సరాల క్రితం సేథ్ గంగారామ్ ఏర్పాటు చేసిన గుర్రపు రైలు పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఇప్పటికీ నడుస్తోంది, రెండు రైళ్లు ముఖాముఖికి వచ్చినప్పుడు  అందుతో ప్రయాణీకులను ఇందులోకి, ఇందులోని ప్రయాణీకులను అందులోకి మార్పుచేసి ప్రయాణానికి ఆటంకం లేకుండా చేస్తారు. ఈ ప్రయాణం ఇక్కడి వారికి చాలా సౌకర్యంగా ఉండటంతో దీనిని నేటికీ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రెండు బోగీల్లోని ప్రయాణీకులను ఒకే గుర్రం వేగంగా గమ్య స్థానం చేర్చడం ఈ గుర్రపు రైళ్ల యొక్క ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు...ఆ వీడియో ఈఎన్ఎస్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం...

2020-07-26 13:29:11

ప్రపంచవ్యాప్తంగా@కరోనా కేసులెన్నో తెలిస్తే..వామ్మో

ప్రపంచ‌వ్యాప్తంగా కోవిడ్‌-19 కేసుల సంఖ్య ఒక కోటి 18 ల‌క్షలు దా టింది.ఇప్పటివ‌ర‌కు క‌రోనాతో 5ల‌క్షల 43 వేల 433 మంది మ‌ర‌ ణించారు.విశ్వవ్యాప్తంగా ఇప్పటివ‌ర‌కు ఒక కోటీ 18 ల‌క్షల 41 వేల 627 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 30 ల‌క్షల 59 వేల 428 క‌రోనా పాజిటివ్ కేసుల‌తో అమెరికా అగ్రస్థానంలో కొన‌సా గుతోంది. ఆ దేశంలో ఇప్పటివ‌ర‌కు క‌రోనా కార‌ణంగా ల‌క్షా 33 వేల 347 మంది మ‌ర‌ణించారు. 16 లక్షల 43 వేల 539 మంది బాధితు లతో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. ఆ దేశంలో 66 వేల 93 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. కోవిడ్‌-19 కేసుల సంఖ్యలో భార‌త్ మూడో స్థానంలో.. రష్యా నాలుగో స్థానంలో కొన‌సాగుతోంది. ఆ దేశంలో ఇప్పటివ‌ర‌కు 6 ల‌క్షల 94 వేల 230 కేసులు న‌మోద‌ య్యాయి.

World Health Organization

2020-07-08 15:06:41

2021 వరకూ కరోనాకి వేక్సిన్ కష్టమే:స్వామినాధన్

కరోనాకు 2021 కంటే ముందుగా వ్యాక్సిన్‌ సిద్ధమయ్యే అవకాశంలేదని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్‌ -19ను కట్టడి చేసే వ్యాక్సిన్‌ ఆగస్టు 15వ తేదీ లోపు అందుబాటులోకి రావాలని భారత వైద్యపరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఆదేశాలివ్వడంపై దుమారం రేగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై విధంగా స్పందించింది. మరోవైపు, వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ పూర్తికావడానికి కనీసం ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ తెలిపారు. కొవాగ్జిన్‌, జైకోవ్‌-డీతో పాటు కరోనా చికిత్సకు ప్రయోగాలు జరుపుకుంటున్న ఏ వ్యాక్సిన్‌ కూడా 2021 కంటే ముందుగా అందుబాటులోకి వచ్చే అవకాశంలేదని తెలిపింది. ‘కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కోసం ఆరు భారతీయ ఫార్మా కంపెనీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

India Gate

2020-07-06 22:49:26