1 ENS Live Breaking News

ఇన్‌స్టాగ్రామ్‌లో మరో నాలుగు అద్భుత ఫీచర్లు..

ఇన్‌స్టాగ్రామ్‌కు యూత్‌ ని మరింత కట్టిపడేసే విధంగా సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఇనిస్ట్రా గ్రామ్  ఫాలోవర్లు అత్యధికంగా పెరుగుతుండటంతో వారికి ఆలోచనలకు, ఆశలకు అనుగుణంగానే యాప్ ను డెవలప్ చేస్తున్నారు నిర్వహాకులు యూత్ లో ఉన్న క్రేజ్‌ కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు నవీకరించుకుంటూ వస్తోంది.  ఇన్‌స్టాగ్రామ్‌ లాంచ్‌ అయిన 13 ఏళ్లు గడుస్తోన్న సందర్భంగా 4 కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. త్వరలోనే ఈ ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నారని తెలుస్తుంది. ఇవి ప్రస్తుతం టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉన్నాయి. త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తున్న కొత్త ఫీచర్స్‌లో డేట్స్‌ రిమైండర్‌ ఒకటి. ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో స్నేహితుల పుట్టిన తేదీ రీమైండర్‌ అందుబాటులో ఉంది. ఇలాంటి ఫీచర్‌నే ఇన్‌స్టాగ్రామ్‌లో తీసుకురానున్నారు. ఈ ఫీచర్‌ ఫాలోయర్లకు, స్నేహితులకు మీ పుట్టిన తేదీని గుర్తు చేస్తుంది. స్టిక్కర్లు, కాన్ఫెటీలతో విషెస్‌ చెప్పేలా డిజైన్‌ చేశారు.  ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం కొందరికి మాత్రమే మీ స్టోరీలు కనిపించేలా ‘క్లోజ్‌ ఫ్రెండ్స్‌’ అనే ఫీచర్‌ అందుబాటులో ఉంది అయితే ఈ ఫీచర్‌కు అప్‌డేట్‌ తీసుకురానున్నారు. స్టోరీలకు మరిన్ని క్యాటగిరీలు యాడ్ చేయనున్నారు. ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ, కోలిగ్స్‌ ఇలా క్యాటగీరి వారీగా స్టోరీలను షేర్ చేసుకోవచ్చన్నమాట. తద్వారా మొత్తం ఫాలోవర్లు కూడా చూసేందుకు వీలుగా వుంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాయిస్‌ మెసేజ్‌ ఫీచర్‌కు అదనంగా కొత్త అప్‌డేట్‌ తీసుకురానున్నారు. నోట్స్‌ సెక్షన్‌ నుంచే ఆడియో మెసేజ్‌లు పోస్ట్ చేయొచ్చు. ఇవి డైరెక్ట్ మేసేజ్‌ లిస్ట్‌లో అన్నింటికంటే పైన కనిపిస్తాయి. కేవలం ఆడియో నోట్స్‌ మాత్రమే కాకుండా, చిన్న చిన్న వీడియోలను రికార్డ్‌ చేసి కూడా నోట్‌గా పోస్ట్ చేయొచ్చు. ఈ పోస్ట్ కేవలం 24 గంటల 
వరకు ఉంటుంది.  నోట్స్‌లో లొకేషన్‌ను ట్యాగ్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ ప్లాన్‌ చేస్తోంది. ఈ కొత్త ఫీచర్‌తో యూజర్లు తాము ఎక్కడున్నామో తెలపుపొచ్చు. ట్యాగ్‌ చేసిన లొకేషన్‌ నోట్స్‌లో టెక్ట్స్‌ మీద కనిపిస్తుంది. ఈ ఫీచర్లన్నీ నూతన సంవత్సరానికి అందుబాటులోకి వచ్చే వకాశాలున్నాయని టెక్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. సరికొత్త ఇనిస్టాగ్రామ్ ఫీచర్స్ యూజర్లకు మరింత చేరువకానున్నాయి.

United States

2023-10-26 05:43:45

అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చిన వాట్సప్

ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సప్ వినియోగదారుల కోసం అదిరిపోయే ఫీచర్ ను తీసుకొచ్చింది. గ్రూపు వీడియో కాల్ చేసుకోవాలంటే ఒకప్పుడు ఒకరికి కాల్ చేసిన తరువాత మరొకరిని యాడ్ కాల్ కొట్టి మాట్లాడేవారు. కానీ ఇపుడు వాట్సప్ వీడియోకాల్ లింక్ ను డెవలప్ చేసింది. మనంఎవరితో అయితే మాట్లాడలనుకుం టున్నామో వారందరికీ వీడియో కాల్ లింక్ షేర్ చేయడమే, వెంటనే వాళ్లు కూడా గ్రూప్ వీడియో కాల్ కి కనెక్ట్ అవుతారు. ఒకప్పడు ఈ విధానం జూమ్ కాలింగ్ లో ఉండేది. అయితే వాట్సప్ ప్రత్యర్ధి యాప్ లు, వెబ్ సైట్ లలో ఉండే ఫీచర్లన్నింటినీ ఒకే చోటుకి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తూ, ఒక్కో ఫీచర్ ను అందుబాటులోకీ తీసుకు వస్తున్నది. తద్వారా వినియోగదారులు వాట్సప్ ను తన ఫోన్ లో నుంచి డిలీట్ చేయకుండా ఉండచేలా కొత్త ఫీచర్లతో దారులును మూసేస్తున్నది. మొన్ననే ఫాలోవర్ ఫీచర్ తీసుకొచ్చి ఇతర సోషల్ మీడియ యాపల్ గట్టి పోటీ ఇచ్చిన వాట్సప్ ఇపుడు ఈ కొత్త ఫీచర్ తో వినియోగదారులకు మరింత చేరువ అయ్యింది. ముఖ్యంగా ఈ గ్రూప్ వీడియో కాలింగ్ లింక్ ఫీచర్ చిన్న గ్రూపులు, కంపెనీలు, సంస్థలకు, బయట ప్రాంతాల్లో ఉన్నవారి ఉద్యోగులతో ఒకేసారి మాట్లాడుకోవడానికి చక్కగా ఉపయోపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వీడియో కాలింగ్ లింక్ ను ఎవరై సభ్యులు మన నెంబర్లను బ్లాక్ చేస్తే మాత్రం పంపడానికి వీలు పడదని మెటా నిర్వాహకులు వాట్సప్ లో ఇచ్చిన లింక్ డిస్క్రిప్షన్ లో తెలియజేశారు. రానున్న రోజుల్లో వాట్సప్ మరిన్ని ఫీచర్లు తీసుకొచ్చే ఆలోచనలో కూడా ఉందట.

United States

2023-10-07 08:44:47

హైడ్రోజన్‌ బస్సులో టెస్ట్‌ డ్రైవ్‌కు వెళ్లిన నితిన్‌ గడ్కరీ

కేంద్ర రవాణా, జాతీయరహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెక్ రిపబ్లిక్ లో హైడ్రోజన్‌ బస్సులో టెస్ట్‌ డ్రైవ్‌ కు వెళ్లారు. అత్యంత అధునాతన సాంకేతికతో అభివృద్ధి చేసిన హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ బస్సులో ఆయన  ప్రయాణించారు. బస్సును పూర్తిగా పరిశీలించి అందుకు సంబంధించిన వివరాలను అక్కడి అధికారులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను గడ్కరీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. కాగా, హైడ్రోజన్‌ ఫ్యూయల్ బస్సులు హైడ్రోజన్‌ వాయువును వాడుకొని విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకొంటాయి. ప్రపంచదేశాలు ప్రస్తుతం పెట్రోలు, డీజిల్ తో నడిచే వాహనాలకంటే బ్యాటరీ, హైడ్రోజన్ వాహనాల తయారీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర మంత్రి హైడ్రోజన్ బస్సులో ప్రయాణించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ప్రస్తుతం చెక్‌ రిపబ్లిక్‌  పర్యటనలో ఉన్న ఆయన ప్రేగ్‌ లో నిర్వహించిన 27వ వరల్డ్‌ రోడ్‌ కాంగ్రెస్‌లో గడ్కరీ పాల్గొన్నారు.   

Check Repoblic

2023-10-03 08:27:29

వాట్సప్ యూజర్లకు కీలక అప్ డేట్ .. ఇక వీడియోకాల్ ఎంతమందంటే

వాట్సప్ యూజర్లకు మెటా కీలక అప్ డేట్ తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ 15 మందితో వీడియో కాల్ చేసుకునే సదుపాయాన్ని ఏకంగా దానిని 30 మందికి పెంచింది. అయితే ఈ ఆప్షన్ అన్ని ఫోన్లకు అందుబాటులోకి రాలేదు. లేటెస్ట్ వెర్షన్ ఫోన్లకు వెంటనే అయిపోతున్నా. పాత వెర్షన్ ఫోన్లకు మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. జూమ్ వీడియోకాలింగ్ యాప్ కి ధీటుగా తీసుకొస్తున్న ఈ వాట్సప్ కాలింగ్ సిస్టమ్ ను మరింత క్వాలిటీగా, ఇంకా ఎక్కువమందిని త్వరలో పెంచే యోచనలో కూడా ఉందట మెటా. ఇప్పటి వరకూ 15 మంది దాటి సిబ్బంది ఉన్న కార్యాలయాలు, చిన్న సంస్థలు జూమ్ వీడియో కాల్ కి వెళ్లేవి. ఇపుడు ఆపరిస్థితి నుంచి వాట్సప్ గ్రూప్ వీడియో కాలింగ్ 30 మందికి పెంచిన కొత్త అప్డేట్ దారి మళ్లించింది. ఈఏడాది చివరికి ఈ సంఖ్యను 100కు ఆపై ఒకేసారి 500కి పెంచే యోచనలో బిజీగా ఉందట మెటా. మరోవైపు ఒకేసారి వాట్సప్ ఛానల్ ఆప్షన్ తీసుకొచ్చి ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాంస్ మాదిరిగా ఫాలోయింగ్ ఆప్షన్ కూడా తీసుకొచ్చింది. ఇందులో పెద్ద పెద్ద వారంతా తమ ఛానల్స్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా రంగం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతున్న తరుణంలో దానితోపాటు పోడీ పడుతూ వాట్సప్ కూడా కీలక అప్డేట్లను తీసుకు వస్తున్నది. అయితే ఇప్పటికీ వీడియోకాలింగ్ క్వాలిటీలో మాత్రం వాట్సప్ వెనుకడుగులోనే ఉందని చెప్పకతప్పదు.

United States

2023-09-22 10:02:29

జాబిల్లిపై నిద్రకు ఉపక్రమించిన విక్రమ్ ల్యాండర్

జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ నిదురకు ఉపక్రమించింది. ఈ నిద్ర సెప్టెంబరు 22 వరకూ ఉంటుంది. ఈ మేరకు ఇస్రో చంద్రయాన్ -3 పై కీలక ప్రకటన చేసింది. స్పేస్ పరిభాషలో విక్రమ్ ల్యాండర్ స్లీప్ మోడ్లోకి వెళ్లిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 'ఇస్రో' వివరించింది. ల్యాండర్ నిద్రావస్థలోకి వెళ్లకముందు అందులోని పేలోడ్లు ChaSTE, RAMBHA,ILSA నూతన ప్రదేశంలో నిర్వహించిన ప్రయోగాల డేటా ఇస్రో కేంద్రానికి చేరిందని పేర్కొంది. ప్రస్తుతం పేలోడ్లు స్విచ్ ఆఫ్ అయ్యాయని తెలిపింది. అయితే ల్యాండర్ రిసీవర్లు మాత్రం ఆన్ లోనేఉన్నట్లు తెలిపింది. రోవర్, ల్యాండర్ SEP-22 తర్వాత తిరిగి పని చేస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపింది. అయితే అందులోని బ్యాటరీలు ఫుల్ గా ఛార్జింగ్ లోనే ఉన్నాయన్న ఇస్రో.  పేలోడ్లు పంపిన సమాచారం విశ్లేషణ జరుగుతుందని ప్రకటించింది. ల్యాండర్ పంపిన సమాచారంలో ఉన్న విషయాలు పరిశోధన తరువాత త్వరలోనే బాహ్య ప్రపంచానికి తెలియనున్నాయి.

Bengaluru

2023-09-04 09:33:44

బాయ్ వర్డ్ ప్యాడ్.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రకటన

మైక్రోసాఫ్ట్ తన వర్డ్ ప్యాడ్ కి బై బై చెప్పేసింది. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ అధికారికంగా వెల్లడించింది. విండోస్ 95తో పరిచయమైన వర్డ్‌ప్యాడ్ 30 ఏళ్లలో ఎంతో మంది ప్రజల్లో ఆదరణ పొందింది. నెటిజన్లు, కంప్యూటర్లు వినియోగించేవారు డాక్యుమెంట్ రైటింగ్‌లో వర్డ్‌ప్యాడ్‌ను విరివిగా వినియోగిస్తున్నారు. అయితే భవిష్యత్‌లో విడుదల చేసే విండోస్ వెర్షన్‌లో వర్డ్‌ప్యాడ్ ఉండదని మైక్రోసాఫ్ట్ తేల్చి చెప్పేసింది. అలా అని అప్‌డేట్ వెర్షన్ కూడా రాదని.. దీని స్థానంలో ‘మైక్రోసాఫ్ట్ వర్డ్’ను వర్డ్ ప్యాడ్ యూజర్లు ఉపయోగించుకోవాలని సంస్థ సూచించింది. చాలా వరకూ ప్రపంచవ్యాప్తంగా దినపత్రికలు, టివి ఛానళ్లు అత్యధికంగా వర్డ్ ప్యాడ్ నే వినియోగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఇది కనుమరుగు అయితే మళ్లీ అందరూ నోట్ ప్యాడ్ వైపే తిరగాల్సి ఉంటుంది. ఇప్పటికే నోట్ ప్యాడ్ ను కూడా అధికంగానే వినియోగిస్తున్న యూజర్లు.. అయితే వర్డ్ ప్యాడ్ లో ఉన్నం సౌఖ్యం నోట్ ప్యాడ్ లో ఉండదు.

United States

2023-09-04 09:25:56

జాబిల్లిపై చంద్రయాన్-3 పయనం మొదలైంది..!

జాబిల్లిపై చంద్రయాన్-3 పయనం మొదలు పెట్టినట్టు ఇస్రో ప్రకటించింది. ఈ విషయానికి సంబంధించిన తాజా బులిటిన్ ను విడుదల చేసింది. చంద్రయాన్-3పై ఇస్రో శుక్రవారం మరో అప్‌డేట్ ప్రపంచానికి ఇచ్చింది. విక్రమ్ ల్యాండర్ నుంచి బయటికొచ్చిన రోవర్ చంద్రుడి ఉపరితలంపై 8 మీటర్ల దూరం వరకూవిజయవంతంగా ప్రయాణించిందని పేర్కొంది. రోవర్ పేలోడ్‌లు LIBS, APXS ఆన్ చేయబడ్డాయని తెలియజేసింది. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్‌లోని అన్ని పేలోడ్‌లు ఎటువంటి సమస్య లేకుండా పని చేస్తున్నాయని వెల్లడించింది. దీనితో దివి నుంచి భువికి వచ్చే తాజా సమాచారంతో అక్కడ ఏం జరుగుతుంది..? చంద్రయాన్ ఏమేమి పరిశోధనలు చేస్తుంది..? ఎలాంటి చిత్రాలు, వీడియోలు పంపిస్తుంది..అందులో ఎలాంటి సమాచారం వుంటుందనే విషయంపై ఇపుడు ప్రపంచమంతా ఆశక్తిగా ఎదురు చూస్తుంది. ప్రస్తుతం ప్రపంచదేశాల చూపు భారత్ పైనే వుంది.

Sriharikota

2023-08-25 15:39:03

అసలు సమస్య చంద్రయాన్-3కి అక్కడే రావొచ్చు..

చంద్రయాన్-3 వ్యోమనౌకలోని అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేస్తున్నాయని ఇస్రో చైర్మన్ ఎస్. సోమ్నాథ్ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ,  వ్యోమనౌక చంద్రుడికి 100 కిలోమీటర్ల సమీపానికి చేరుకున్నాకే కీలక దశ మొదలవుతుందని అన్నారు. ఆ తరువాత చంద్రయాన్- 3 చంద్రుడికి ఎంత ఎత్తులో ఉందనేది భూమ్మీద నుంచి కచ్చితంగా నిర్ధారించడం..అత్యంత కీలక ఘట్టమని పేర్కొన్నారు. ఈ దశను ఆర్బిట్ డిటర్మినేషన్ ప్రాసెస్ అంటారని 
వివరించారు. ఇప్పటివరకూ అంతా అనుకున్నట్టు జరిగిందని, చంద్రయాన్-2 అనుభవం.. ఉపయోగపడిందని ఇస్రో చైర్మన్ తెలిపారు. 'చంద్రుడికి 100 కిలోమీటర్ల
ఎత్తువరకూ ఎటువంటి ఇబ్బందీ ఉండదని భావిస్తున్నాం. ఆ తరువాత చంద్రయాన్-3 చంద్రుడి..ఉపరితలం నుంచి ఎంత దూరంలో ఉందనేది కచ్చితంగా నిర్ధారించాల్సి ఉంటుంది. ఇది సరిగ్గా జరిగితే మిగిలిన వ్యవహారమంతా సులువుగా పూర్తవుతుంది. ఈసారి అంతా సక్రమంగా జరుగుతుందని భావిస్తున్నామని అన్నారు. ఇప్పటివరకూ కక్ష్య మార్పులన్నీ ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగాయని...ఈ క్రమంలో చంద్రయాన్-1 అనుభవం మాకు బాగా లాభించిందని చెప్పారు. అప్పట్లో తప్పు ఎక్కడ జరిగిందనే దానిపై నిశితంగా అధ్యయనం చేశాం. ఈ అనుభవంతో చంద్రయాన్-3లో పలు మార్పులు చేశాం" అని ఇస్రో చైర్మన్ పేర్కొన్నారు.  ప్రస్తుతం ఈ వ్యోమనౌక చంద్రుడి చుట్టూ 170/313 దీర్ఘ వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తోంది. చంద్రయాన్ వ్యోమనౌకను జాబిల్లికి మరింత చేరువగా తీసుకెళ్లేందుకు ఇస్రో ఆగస్టు 9, 17న, కక్ష్య కుదింపు చర్యలు చేపట్టనుంది. అంతా సక్రమంగా సాగితే ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై దిగుతుందని చెప్పారు. కాగా జూన్ 14న ఆర్బిటర్, ల్యాండర్, రోవర్తో కూడిన చంద్రయాన్-3 శ్రీహరి కోట నుంచి నింగిలోకి ఎగసిన విషయం తెలిసిందే.

Bengaluru

2023-08-08 14:55:27

ట్విట్టర్ తో భారీ ఆదాయం ఆర్జించే దిశగా అడుగులు

ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఎలాన్‌మస్క్‌ నష్టాలను పూడ్చుకోవడంతోపాటు, భారీగా ఆదాయాన్ని సమకూర్చుకునే పనిలో పడ్డాడు. దా నికోసం ట్విట్టర్ లో చాలా మార్పులు చేస్తూ వస్తున్నాడు. తాజాగా యూజర్లు తమ కంటెంట్‌ నుంచి డబ్బు సంపాదించుకునేందుకు మానిటైజే షన్‌ ఆప్షన్‌ తీసుకొచ్చి ఆధ్యంతం ట్విట్టర్ కు ప్రేక్షకులను కట్టిపడేసేవిధంగా తయారు చేశాడు. ఎక్కువ నిడివి గల వీడియోల వరకు దేనికైనా సబ్‌స్క్రిప్షన్‌ ఆప్షన్‌ పెట్టుకొని డబ్బులు ఆర్జించుకోవచ్చని ప్రకటించడాడు. దీంతో మస్క్‌ ట్విటర్‌కు 24,700 మంది సబ్‌స్క్రైబర్లు ఉండగా ఒ క్కోక్కరి నుంచి నెలకు రూ.277 అంటే ఏడాదికి రూ.8.2 కోట్లు రానున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తున్నతరుణంలో ట్విట్టర్ ను వేదికగా చేసుకొని చాలా రాజకీయపార్టీలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన మస్క్ దాని ద్వారానే ఆదాయం సమకూర్చుకోవాలనే ఆలోచనతో వినూత్నంగా ముందుకి కదులుతుండటం చర్చనీయాంశం అవుతోంది.

United States

2023-04-27 06:55:53

ఈరోజు ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న హ్యాష్ టాగ్స్

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ లో ఈరోజు కీలకమైన హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అందులో కొన్ని టాప్ టెన్ లో ఉన్నవి ఏంటంటే..#Prabhas, #ADANIENT, #TarakaRatna, #GOAT, #FireStormIsComing, #FarahKhan, #AirAsia, #Rolex , #Chiranjeevi, #ExMuslimonYoutube ముఖ్యంగా ప్రభాస్, అధానిఈఎన్టీ, తారకరత్న, గోట్ హ్యాష్ ట్యాగ్ లు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. ట్విట్టర్ లో వచ్చే పోస్టులకు కూడా వీటినే చాలా మంది నెటిజన్లు వినియోగించడం విశేషం..

United States

2023-04-09 16:26:52

ఛాట్ జిపిటీలోనూ సాంకేతికలోపాలు..యూట్యూబు లానే

ఛాట్ జిపిటిలో లోపాలు ఉన్నాయని..ఛాట్ జిపిటి అనేది యూట్యూబులానే పనిచేస్తుందని ఇందులో కొత్తేముందని టెకీలో పెదవి విరుస్తు న్నారు. గుగూల్ లోనూ, యూట్యూబ్ లోనూ సెర్చింగ్ లో అడిగిన వాటిని డేటా ఎలా వస్తుందో..ఛాట్ జిపిటీలో అయితే మాత్రం అడిగిన ప్రశ్నల కు కంపోజింగ్ డేటా డిస్ ప్లే అవుతోంది. అయితే అడిగిన ప్రశ్నలకు పూర్తిస్థాయిలో మాత్రం జవాబులు రావడం లేదు. మరోపక్క ఛాట్ జిపిటీ వలన చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఉద్యోగాలను సాఫ్ట్ వేర్ సంస్థలు తీసేస్తున్నాయనే సమాచారం టెకీలను కలవరపాటుకి గురిచేస్తు న్నది. వాస్తవానికి ఇందులో సెర్చ్ చేసే డేటా కూడా పూర్తిగా రావడం లేదు. కొద్దిగా సాఫ్ట్ వేర్ కోడింగ్ పై అవగాహన ఉన్నవారికి మాత్రం ఇందు లో వచ్చే సాంపిల్ కోడింగ్ ద్వారా డెవలప్ చేయాలనుకునేవారికి మాత్రం కాస్త మంచి ప్లాట్ ఫాంగా ఉపయోగ పడుతుందని మాత్రం టెకీలు చెబుతున్నారు. ఛాట్ జిపిటీ తరహా వెబ్ సైట్లు చాలానే వచ్చినప్పటికీ ఇది మిగిలిన వాటికి కొద్దిగా పోటీ ఇస్తున్నది..!

United States

2023-03-30 06:20:48

విశాఖ మీకు గుర్తిండిపోతుందని భావిస్తున్నాను

విశాఖ వేదికగా జరుగుతున్న జీ–20 సదస్సుకి తొలి రోజు.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. అతిథులతో కలిసి ఆయ న విందులో పాల్గొన్నారు. అనంతరం వారితో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాన్ని ఉద్దేశించి సీఎం జగన్‌ మాట్లాడారు. విశాఖలో మీరు గడిపిన సమయం మీకు మధురానుభూతిని మిగులుస్తుందని భావిస్తున్నానని అన్నారు.  ఆంధ్రప్ర దేశ్ లో ప్రతి ఒక్క నిరుపేదకూ ఇంటి సౌకర్యం కల్పించాలన్నది మా ఉద్దేశమని అన్నారు. అంతేకాకండా మేము అధికారంలోకి వచ్చాక.. 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చామని, 22 లక్షల ఇళ్లు కడుతున్నామని తెలియజేశారు. ఈ ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించ డానికి ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు చేపడుతోందని వివరించారు. దీనిపై సరైన చర్చలు జరిపి.. సస్టెయిన్‌బుల్‌ పద్ధతులను సూచించాల ని కోరారు. ఈ అంశంపై మీరు చక్కటి చర్చలు చేయాలన్నారు.

Visakhapatnam

2023-03-28 16:03:03

United States

2023-03-01 02:17:30

మల్టీ లాంగ్వేజ్ ఫీచర్ తో రాబోతున్న యూట్యూబ్

ప్రపంచలోని అన్ని భాషలు అందరూ తెలుసుకునేలా..ఏ భాషలో ఉన్న ప్రాంతీయ భాషలో తెలుసుకునేలా యూట్యూబ్ సరికొత్త ఫీచర్ తీసుకురాబోతుంది. అవుతు మీరు చదువుతున్నది అక్షర సత్యం. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ వస్తే ఏ భాషలోని విడియో అయినా మనకి నచ్చిన భాషలో ఆడియోను వినవచ్చు. తద్వారా యూట్యూబ్ లోని సమాచారం మరింత మందికి వినియోగపడటం ఖాయంగా కనిపిస్తున్నాది.  కాగా ఈ ఫీచర్ ను ఎనేబుల్ చేసేందుకు సెట్టింగ్స్ లో ఉన్న ఆడియో ట్రాక్ ఆప్షన్ ను క్లిక్ చేసి, నచ్చిన భాషను సెలక్ట్ చేసుకోవాల్సి వుంటుంది. ప్రస్తుతం యూట్యూబ్ ని వినియోగించుకొని చాలా మంది విద్యార్ధులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తమకు కావాల్సిన సమాచారం తెలుసుకుంటున్నారు. ఈ ఫీచర్ అందుబాటులోకి రావడం ద్వారా ఇతర లాంగ్వేజిల్లో ఉన్న వీడియోలను చక్కగా అర్ధం చేసుకోవడానికి వీలుపడుతుంది.

United States

2023-02-26 09:54:03