1 ENS Live Breaking News

ఇంతకీ సిత్రాంగ్ తుపాను పయనం ఎటు

భారీ తుపాను..భారీ తుపాను..ఇలా సిత్రాంగ్ చుట్టూ ఎన్నో వదంతులు వినిపించాయి. ఆ భారీ తుపాను మాట ఎలా వున్నా సోషల్ మీడియా పుణ్యమాని జరిగిన ప్రచారం మాత్రం అంతా ఇంతా కాదు. ఎట్టకేలకు తుఫాను వదంతుల పై భారత వాతావ రణ శాఖ (ఐఎండీ) స్పష్టతని చ్చింది. తుఫాన్‌ ముప్పు వాస్తవమే నని తేల్చింది. ఈ నెల 22 తర్వాత బంగాళాఖాతంలో తుఫాన్‌ రాబోతుందని మంగళవారం నిర్ధారించింది. ఈ నెల 22 నుంచి 25 మధ్యన తుఫాన్‌ రానున్నట్టు వారం నుంచి అంతర్జాతీ యంగా పలు సంస్థలు  ప్రకటిస్తూ వస్తున్నాయి. అయితే వదంతులు నమ్మవద్దని ఐఎండీ అధికారులు కొట్టిపా రేస్తూ వచ్చినా తుపాను విషయాన్ని మాత్రం ద్రువీకరించారు. ఈ వారంలో అల్పపీడ నం ఏర్పడే అవకాశా లుండడంతో.. ఈ నెల 22 తర్వాత ప శ్చిమ మధ్య బంగా ళాఖాతంలో తుఫాన్‌ రాబోతుందని ఐఎండీ మంగళవా రం ప్రకటించింది. అయితే అల్పపీడ నం ఏర్పడిన తర్వా త మాత్రమే ఈ తు ఫాను ఎక్కడ తీరం దాటుతుంది..?, దాని తీవ్రత ఎలా ఉంటుంది..? వంటి అంశాలపై ప్రకటన చేస్తామని ఐఎండీ చీఫ్‌ మృత్యుంజయ మహాపాత్రో తెలిపా రు.

 కాగా దక్షిణ అం డమాన్‌ సముద్రంలో ని ఉపరితల ఆవర్త నం మంగళవారానికి ఉత్తర అండమాన్‌ సముద్రంలో కొనసా గుతోంది. దీని ప్రభా వంతో ఈనెల 20 నాటికి ఆగ్నేయ, దానికి ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్ప డుతుందని తేలిపా రు. రెండు రోజుల పాటు పశ్చిమ వా యవ్యంగా పయనిం చే క్రమంలో బలపడి 22వ తేదీకల్లా మ ధ్య బంగాళాఖాతం లోకి ప్రవేశించి వా యుగుండంగా మా రుతుందని తెలిపా రు. మరింత బలప డి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి తుఫాన్‌గా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్‌ గమనంపై ఈనెల 20 తర్వాత ప్రకటన చేస్తామని పేర్కొంది. కాగా.. మంగళవా రానికే పశ్చిమ మ ధ్య అండమాన్‌ స ముద్రంలో అల్పపీ డనం ఏర్పడిందని ఇస్రో వాతావరణ నిపుణుడు వెల్లడిం చారు.

 ఇది పశ్చిమం గా పయనించి ఈనె ల 19 లేదా 20వ తే దీకల్లా తీవ్ర అల్పపీ డనంగా మారుతుం దని.. 22కల్లా తూ ర్పు మధ్య బంగాళా ఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా, తీవ్ర వాయుగుండం గా బలపడుతుందని పేర్కొన్నారు. అనం తరం దిశ మార్చుకు ని తుఫాన్‌గా మారి వాయవ్య బంగాళా ఖాతంలో ప్రవేశించి ఉత్తర ఒడిసా, పశ్చి మ బెంగాల్‌ మధ్య తీరం దాటుతుందని తెలిపారు. దీంతో ఈ నెల 23 నుంచి 25 వరకు ఉత్తర కోస్తా జిల్లాలపై కొంత ప్రభా వం ఉంటుందన్నా రు. కాగా తుఫాన్‌ తీరందాటే విషయం లో ఒక్కొక్క సారి ఒక్కో విధంగా ఉం టుందని  చెప్పారు. మోడల్‌ ఒకేలా అంచనా వేసింది. తుఫాన్‌ ఉత్తర కోస్తా లో తీరం దాటుతుం దని అమెరికా వాతా వరణ విభాగానికి చెందిన జీఎఫ్‌ఎస్‌ అంచనా వేయగా, ఐరోపాకు చెందిన 'ఈసీఎండబ్ల్యూఎఫ్‌', ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా మరికొన్ని దేశాలు నిర్వహిస్తు న్న 'ఎన్‌సీయూఎం' మాత్రం బంగ్లాదేశ్‌ వైపు వెళుతుందని పేర్కొన్నాయి. కాగా తీవ్ర తుపాను అలెర్ట్ తో అన్ని దేశాల ప్రభుత్వాలు జాగ్రత్తపడుతున్నాయి.

Hyderabad

2022-10-19 16:59:25

తాజావార్తలను మోసుకొచ్చే పేపర్ బయ్స్ రోజు

తొలి సంధ్యవేళ కోడి కూయకముందే ఇంటి ముందుకు క్షణకాల అతిథిలా తాజావార్తల సమాహారాన్ని చుట్టబెట్టుకొస్తాడు.. జోరువానలోనూ.. ఎముకలు కొరికే చలిలోనూ తానెవరో సమాజానికి కనిపించకుండా సైకిల్‌పై తలుక్కున ఓ మెరుపులా వచ్చి పోతాడు. భాహ్య ప్రపంచంలోని నిత్యనూతన సమాచారాన్ని అందించే తొలి సామాజిక కార్యకర్త అతడు. చీకటి తెరలను చీల్చుకుంటూ పేపర్‌ చేతిలో పెట్టుకుని ప్రతి ఇల్లూ తిరుగుతూ సార్‌.. పేపర్‌ అంటూ వేడి వేడి వార్తలను మన ముంగిటకు చేర్చే కనిపించని వ్యక్తే పేపర్‌ బాయ్‌.. ఒక్కముక్కలో చెప్పాలంటే ఆయన లేనిదే ప్రపంచంలో ఏం జరుగుతోంది తెలియని పరిస్థితి. అలాంటి పేపర్ బాయ్ కి కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఈ అవనిపై ఉందంటే అతిశయోక్తి కాదు.. తొలి పేపర్‌ బాయ్‌గా గుర్తింపు పొందిన బార్నీ ప్లాహెర్డీ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా సెప్టెంబరు 4న అంతర్జాతీయ పేపర్‌బాయ్‌ దినోత్సవం జరుపుతున్నారు.

 అసలు పేపర్ బాయ్ గా గుర్తింపు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం, అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన బెంజుమన్‌ న్యూయార్క్‌సన్‌ పేపర్‌ను విక్రయించేందుకు పేపర్‌బాయ్స్‌ కోసం మొట్టమొదటిసారిగా ప్రకటనను ప్రచురించింది. ఓ నిరుపేద కుటుంబానికి చెందిన బ్లార్నీ సైహార్డీ అనే పదేళ్ల బాలుడు 1833, సెప్టెంబరు 4వ తేదీన మొట్టమొదటి పేపర్‌బాయ్‌గా విధుల్లో చేరారు. పేపర్‌బాయ్‌గా పాఠకుల హృదయాల్లో స్థానం సంపాదించిన బార్నీ పుట్టినరోజు కూడా సెప్టెంబరు 4 కావడంతో ఆ రోజును పేపర్‌ బాయ్స్‌డేగా ప్రకటించారు. అమెరికాలోని హ్యూస్టన్‌లో టెక్సాస్‌ ప్రెస్‌ అసోసియేషన్‌ 125వ వార్షికోత్సవం సందర్భంగా బార్నీ గౌరవార్థం 2005లో అతడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నాటి నుంచి పేపర్‌బాయ్స్‌ డే ప్రాచుర్యంలోకి వచ్చింది. 

అసలు పేపర్‌బాయ్‌ పని అంటే.. ఏదో పేపర్లు తీసుకొని ఉదయం ఇళ్ల వద్ద వేసి వెళ్లిపోతారని అనుకుంటారు అంతా. అయితే ఇందులో ఉన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఎందరో పాత్రికేయులు రేయింబవళ్లు శ్రమించి సేకరించిన వార్తలను సబ్‌ఎడిటర్లు సరిచేసి ముద్రణ ఆమోదయోగ్యంగా మలుస్తారు. ఆ తర్వాత ముద్రించబడ్డ దిన పత్రికలను పాఠకులకు చేరవేయాల్సిన బాధ్యత పేపర్‌బాయ్‌లదే. తెల్లవారు జామున 3.30 గంటలకు ముందే పేపర్‌బాయ్‌లు నిద్రలేచి సైకిల్‌పై బయలుదేరి పేపర్‌ కట్టలు వచ్చే పాయింట్లకు చేరుకుంటారు. దినపత్రికలను సర్దుకున్నాక పై అంతస్థులో ఉన్న ఇళ్లకు పేపర్‌ను ఎగర వేసేందుకు తాడుతోనూ, పేపర్‌నే పొట్లంగా మలిచి ఆ కట్టలను సైకిల్‌పై సర్దుకుని బయలు దేరుతారు. తమ ఖాతాదారులకు పత్రికలు వేసుకుంటూ ముందుకు  సాగిపోతారు.

 పేపర్‌ వేసే క్రమంలో సైకిల్‌ లేదా ద్విచక్ర వాహనం మరమత్తులకు గురవడం, ఆరోగ్యం బాగలేక నిద్రలేవడం ఆలస్యమైతే ఇక తిట్ల దండకాలే. బిల్లులు సకాలంలో వసూలు చేయకపోతే ఏజెంట్లు జీతాలు ఇవ్వడంలో ఇబ్బందులకు గురిచేయడం ఇలా చాలా బాధలే ఉన్నాయి. మన భారతదేశంలో చాలా మంది ప్రముఖులు ఒకప్పుడు పేపర్ బాయ్ గా చేసినవారే, ఇప్పుడు వారెవరో తెలుసుకుందాం, కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసిన దివంగత భారత రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం విద్యార్థి దశలో పేపర్‌బాయ్‌గా పని చేశారు. ఆయన విద్యార్థి దశలో పుస్తకాల ఖర్చుల కోసం తెల్లవారుజామునే లేచి ఇంటింటా పేపరు వేసేవారు. ఇక ప్రఖ్యాత జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత రాపూరి భరద్వాజ కూడా పేపర్‌బాయ్‌గా పని చేశారు. స్వాతంత్రోద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న రోజుల్లో బాలగంగాధర్‌ తిలక్‌ సైతం పీపుల్స్‌వార్‌ పత్రికకు కొన్నాళ్లపాటు పేపర్‌బాయ్‌గా పనిచేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహనీయులు, మహానుబావులు పేపర్‌బాయ్‌లుగా పనిచేసిన వారే. కాబట్టి, పేపర్ బాయ్స్ అందరికి మరొక్కసారి ప్రపంచ పేపర్ బాయ్ రోజు శుభాకాంక్షలు తెలుపుకుందాం.

New Delhi

2022-09-04 02:15:45

ప్రారంభమైన అంతర్జాతీయ విమానాలు

సుమారు మూడున్నరేళ్ల తర్వాత విజయవాడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (గన్నవరం) నుంచి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు ప్రారంభం కానున్నాయి. కోవిడ్‌ పస్ట్‌వేవ్‌ తర్వాత నుంచి ఇప్పటివరకు వందేభారత్‌ మిషన్‌లో భాగంగానే ఇక్కడికి సర్వీస్‌లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌ (యూఏఈ)లోని షార్జా–విజయవాడ మధ్య వారానికి రెండు డైరెక్ట్‌ విమాన సర్వీస్‌లు నడిపేందుకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ముందుకొచ్చింది. షెడ్యూల్‌ను ప్రకటించడంతోపాటు టికెట్ల బుకింగ్‌ను కూడా ప్రారంభించింది.  అక్టోబర్‌ 31వ తేదీ నుంచి ప్రతి సోమ, శనివారాల్లో షార్జా–విజయవాడ మధ్య ఈ సర్వీస్‌లు నడవనున్నాయి. 186 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన బోయింగ్‌ 737–800 విమానం భారతీయ కాలమానం ప్రకారం షార్జాలో మధ్యాహ్నం 1.40 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.35 గంటలకు ఇక్కడికి చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 6.35 గంటలకు ఇక్కడ బయలుదేరి రాత్రి 10.35 గంటలకు షార్జా చేరుకుంటుంది. ఇక్కడి నుంచి షార్జాకు ప్రారంభ టికెట్‌ ధరను రూ.15,069గా నిర్ణయించారు. ఈ సర్వీస్‌ ప్రారంభమైతే ఇక్కడి నుంచి అరబ్‌ దేశాలకు ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా పెరగవచ్చని ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.  
 
అంతర్జాతీయ ప్రయాణానికి ఊతం  
ఈ విమానాశ్రయానికి 2017 మే నెలలో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ హోదా కల్పించింది. 2019లో ఆరునెలల పాటు విజయవాడ–సింగపూర్‌ మధ్య నడిచిన వారానికి ఒక సర్వీస్‌ సాంకేతిక కారణాలతో రద్దయింది. తర్వాత దుబాయ్, సింగపూర్‌కు అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు నడిపేందుకు జరిగిన ప్రయత్నాలు కోవిడ్‌ పరిస్థితులతో నిలిచిపోయాయి. కేవలం వందేభారత్‌ మిషన్‌లో భాగంగా ఇక్కడి నుంచి ఒమన్‌ రాజధాని మస్కట్‌కు వారానికి ఒక సర్వీస్, షార్జా, కువైట్, మస్కట్‌ల నుంచి వారానికి ఐదు సర్వీస్‌లు ఇక్కడికి నడుస్తున్నాయి. 
 
ఇటీవల అంతర్జాతీయ విమాన సర్వీస్‌లపై కేంద్రం నిషేధం ఎత్తేయడంతో ఇక్కడి నుంచి పూర్తిస్థాయిలో విదేశాలకు సర్వీస్‌లు నడిపేందుకు సన్నహాలు ప్రారంభమయ్యాయి. షార్జా–విజయవాడ మధ్య పూర్తిస్థాయి విమాన సర్వీస్‌లు అందుబాటులోకి రానుండడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వీస్‌ వల్ల యూఏఈలోని షార్జాతో పాటు దుబాయ్, అబుదాబి, అజ్మన్, పుజిరా, రస్‌ ఆల్‌ ఖైమా నుంచి ఇక్కడికి సులభంగా రాకపోకలు సాగించొచ్చు. అంతేగాకుండా గల్ఫ్‌లోని పలు దేశాలకు వెళ్లేందుకు షార్జా నుంచి సులభమైన కనెక్టివిటీ సదుపాయం కూడా ఉంది. భవిష్యత్‌లో ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా దుబాయ్, కువైట్‌ల నుంచి ఇక్కడికి పూర్తిస్థాయిలో సర్వీస్‌లు నడిపేందుకు ఎయిర్‌లైన్స్‌ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

Gannavaram

2022-08-29 12:25:21

పతన దశకు చేరుకున్న పాక్ ప్రభుత్వం

పాకిస్థాన్‌ లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పతన దశకు చేరుకుంటోంది. ప్రస్తుతం ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ కు వ్యతిరేకంగా తమ పార్టీ ఎంపీలు, మంత్రులు రాజీనామాలు చేస్తున్నారు. దీంతో అధికారంలో ఉన్న ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం ఒక్కసారిగా తీవ్ర సంక్షోభంలో పడింది. ప్రతిపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం కారణంగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. గత వారం పాకిస్థాన్‌ పార్లమెంట్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఏ క్షణమైనా ఓటింగ్‌ జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నిన్న 24 మంది ఎంపీలు, ముగ్గురు మం‍త్రులు రాజీనామా చేశారు. ఈరోజు మరికొందరు రాజీనామా చేస్తారనే వార్తలొస్తున్నాయి. ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం అవిశ్వాస తీర్మాణం నెగ్గాలంటే 172 సీట్ల మెజార్టీ నిరూపించుకోవాలి. కాగా, దిగువ సభలో ప్రభుత్వానికి 155 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు 4 మిత్రపక్షాలతో కలిసి(155+ మిత్రపక్షాలు 20 సీట్లు) 175 సీట్లను ప్రభుత్వం కలిగి ఉంది. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పాలనలో దేశంలో ఆర్థిక వ్యవస్థ బలహీనపడటంతో దిగువ సభలో ‍ప్రభుత్వ మిత్రపక్షాలన్నీ ప్రతిపక్షం వైపు మొగ్గు చూపుతున్నాయని పర్వేజ్ ఎలాహి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఏర్పడింది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి సైన్యం మద్దతు ఉందని, అందుకే ఆయన అంత ధీమాగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. మరోవైపు అవిశ్వాసానికి ముందే ఇమ్రాన్‌ ఖాన్‌ రాజీనామా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే అత్యంత దారుణంగా సొంతపార్టీ మంత్రులే ప్రభుత్వాన్ని కూల్చేసిన ప్రభుత్వంగా పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం వార్తల్లోకి ఎక్కనుంది.

Pakistan

2022-07-15 06:42:30

వాషింగ్టన్ డిసిలో వైభవంగా శ్రీవారి కళ్యాణం

తిరుమల తిరుపతి దేవస్థానములచే  అమెరికాలోని వాషింగ్టన్ డిసి నగరంలో  భారతకాల మానం ప్రకారం మంగళవారం వేకువ జామున శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి  కళ్యాణం కన్నుల పండుగలా జరిగింది. టీటీడీ  అర్చకస్వాములు, వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం, సాంప్రదాయ బద్దంగా కళ్యాణాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ  ఎపిఎన్ఆర్టి ఎస్ టీటీడీ, ఆయా నగరాల కార్యనిర్వాహక వర్గాలను  సమన్వయం చేసుకుని కళ్యాణోత్సవం నిర్వహణలో పాలు పంచుకుంటోంది.  అశేష సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించి తరించారు.కళ్యాణోత్సవం అనంతరం భక్తులందరికీ  ప్రసాదం పంపిణీ చేశారు. శ్రీవారి  కళ్యాణోత్స క్రతువులో భాగంగా పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ,మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణ మాయిరం, హారతితో శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. 

వాషింగ్ టన్ డీసీ

2022-07-05 10:35:50

తల్లిపాలతో కరోనా మటుమాయం..

తల్లిపాలలో వున్న రోగ నిరోధక శక్తితో కరోనా మటుమాయం అవుతోంది. ఈ విషయాన్ని క్యాంపినాస్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా రుజువు చేసి చూపారు. కరోనా సోకిన మహిళకు బ్రెజిల్ లోని శాస్త్రవేత్తల బ్రుందం ప్రతీ మూడు గంటలకు ఒక సారి 30 మిల్లీలీటర్ల తల్లిపాలను ఇచ్చారు. ఇలా వారం రోజుల పాటు పరీక్షించగా తల్లిపాలలోని రోగ నిరోధక శక్తితో కరోనా సోకిన మహిళకు వైరస్ మటుమాయం అయ్యింది.  సోవోపోలో లోని క్యాంపినాస్ విశ్వవిద్యాలయం(UNICAMP) శాస్త్రవేత్తల బ్రుందం ఈ విషయాన్ని తెలియజేసింది. వాస్తవానికి తల్లిపాలలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు అత్యధికంగా ఉంటాయి. దానినే ప్రామాణికంగా తీసుకొని వాటినే కరోనా వైరస్ సోకిన మహిళపై పరీక్షంచగా విజయం సాధించారు. ఇపుడు ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. 

Brazil

2022-06-24 13:39:17

Davos

2022-05-24 14:01:35

Davos

2022-05-24 05:10:43

వ్యాక్సిన్ తీసుకోకపోతే తీవ్ర ప్రమాదం..

కరోనా తన స్వరూపాలను మార్చుకుంటున్న తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా నిపులు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతేకాదు అలాంటివారందరినీ కరోనా కొత్త వేరియంట్ ఫ్యాక్టరీ నిర్వాహకులుగా అభివర్ణిస్తున్నారు. కరోనా మహమ్మారిని నియంత్రించడం కోసం మన ముందున్న ఏకైక మార్గం వ్యాక్సిన్ తీసుకోవడం. కానీ చాలా మంది వ్యాక్సిన్ తీసుకోవడానికి ఇష్టపడటంలేదు. ఏదో ఒక కారణం చెప్పి వ్యాక్సిన్ తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారు. ఇలా చేయడాన్ని అమెరికాలోని వ్యాండెర్‌బిల్ట్ యూనివర్సిటీలోని అంటువ్యాధుల నిపుణులు తప్పుబడుతున్నారు. ఈ వర్సిటీకి చెందిన డాక్టర్ విలియం షాఫ్నర్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ రాకుండా వ్యాక్సిన్ తీసుకోని వారు వైరస్ కొత్త వేరియంట్ల ఉత్పత్తికి ఫ్యాక్టరీల్లాంటి వాళ్లని చెప్పారు. ‘‘ఎంతమంది వ్యాక్సిన్ తీసుకోని ప్రజలు ఉంటే.. వ్యాక్సిన్ పెరగడానికి అన్ని ఎక్కువ అవకాశాలు ఏర్పడతాయి. ఇది పెరిగేకొద్దీ మ్యూటేషన్లు జరుగుతాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న వేరియంట్ల కన్నా భయంకరమైన వేరియంట్‌ తయారై ప్రపంచం మీద విరుచుకు పడే ప్రమాదం ఉంది’’ అని విలియం షాఫ్నర్ పేర్కొన్నారు.

Washington

2021-07-04 13:51:03

అప్పన్నకు ఎన్నారై చందన సమర్పణ..

సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామివారికి కాలిఫోర్నియాలో సెటిలైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సునీత శనివారం అరకేజీ చందనం సమర్పించారు. ఈ మేరకు ఈఓ అకౌంట్ లోకి రూ.10,116 పంపారు. తన తల్లి, పిల్లలతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.   తమ పెద్ద పాపకు చర్మ సమస్య ఉందని, అమెరికాలో ఎన్ని ఆస్పత్రులకు తిప్పినా తగ్గలేదని, అందుకే స్వామివారి దర్శనానికి వచ్చి చందనం సమర్పించామని ఆమె తెలిపారు. స్వామివారి ప్రసాదం చందనం ముక్కను అరగదీతి  తన కుమార్తెకు పూస్తామని ఆమె వివరించారు. తెలిపారు. స్వామివారికి రోజూ పూజచేస్తున్నామన్నారు. అంతకు ముందు ఏఈఓ రాఘవ కుమార్ నుంచి చందనం చెక్కను ప్రసాదంగా అందుకున్నారు. 

Simhachalam

2021-07-03 12:53:07

2021-06-05 02:25:54

రహీమున్నీసాబేగంకు అంతర్జాతీయ గౌరవం..

విశాఖకు చెందిన ప్రముఖ న్యాయవాధి, సామాజిక వేత్త రహీమున్నిసాబేగంకు అంతర్జాతీయ ఖ్యాతి గౌరవం దక్కింది. ఆఫ్రికా గ్లోబల్ డేవలెప్మెంట్ ఫర్ పాజిటివ్ చేంజ్ ఇనిషేయిటివ్ ఆధ్వర్యం లో మహిళా సాధికారత తో సామాజిక వికాసం అనే అంతర్జాతీయ సమావేశం లో మనదేశ  ప్రతినిధిగా పాల్గొనే అవకాశం దక్కింది. ఈరోజు సాయంత్రం వెబినార్ ద్వారా జరిగిగే సదస్సులో ఈమె పాల్గొని ప్రసంగించనున్నారు. ఇప్పటికే పలు జాతీయ కార్యక్రమాలో వక్తగా పాల్గొన్న ఈమెకు అంతర్జాతీయ స్థాయి వెబినాలో ఆహ్వానిత వక్తగా పాల్గొనే అవకాశం రావడం చెప్పుకోదగ్గ అంశం. ఇప్పటికే సహచర న్యాయవాదులు, పలువురు సామాజిక వేత్తలు రహీమున్నిసాబేగంకు దక్కిన ఈ గౌరవంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సాధికారత, అభివ్రుద్ధి, శిక్షణ, చదువు తదితర అంశాల్లో ప్రసగించే మంచి వక్తగా ఇప్పటికే ఈమే మంచి పేరుతెచ్చుకున్నారు.

Visakhapatnam

2021-06-05 01:53:29

2021-06-02 03:08:37