1 ENS Live Breaking News

టెలీగ్రామ్ కి పెరుగుతున్న ఆదరణ..

ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా యాప్ టెలీగ్రామ్ కి ఆధరణ క్రమేపీ పెరుగుతూ వస్తుంది. ప్రభుత్వ అధికారులు, రాజకీయపార్టీలు అన్నీ టెలీగ్రామ్ గ్రూపును అధికంగా వినియోగిస్తున్నాయి. టెలీగ్రామ్ గ్రూపు ద్వారా అత్యధిక మంది సభ్యులను చేర్చేకునే వీలుండటంతో ప్రభుత్వ ఉన్నతాధికారులు సైతం ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అత్యధికంగా ఈ యాప్ ను జర్నలిస్టులు అధికంగా వినియోగిస్తున్నారు. వాట్సప్ కంటే, టెలీగ్రామ్ లో వీడియోలు, ఫోటోలు క్వాలిటీ చెక్కుచెదరకుండా రావడమే దీనికి ప్రధాన కారణం. దానికతోడు, వాట్సప్ లో 250 మందికి మించి సభ్యులను చేర్చుకునే అవకాశం లేకపోవడం కూడా టెలీగ్రామ్ యాప్ ని అందరూ వినియోగించడానికి కారణం అవుతోంది. ఒకప్పుడు టెలీగ్రామ్ యాప్ ని అందరూ వినియోగించాలని భారీ స్థాయిలో ప్రచారం జరిగినా, ఎవరూ దానిని సద్వినియోగం చేసుకోలేదు. రాను రాను దాని యొక్క ఉపయోగాలు తెలియడంతో ప్రస్తుతం దీనిని 500 మిలియన్లకు పైగా వినియోగిస్తున్నారు. ఇక వాట్సప్ ను 5బిలియన్ల మంది వినియోగిస్తున్నారు. ఇటీవల టెలీగ్రామ్ లో కూడా వీడియోకాలింగ్ చక్కని క్వాలిటీతో రావడంతో, గ్రూపు సభ్యుల్లో ఎవరైనా గ్రూపులోకి ఇతర సభ్యులను యాడ్ చేసే అవకాశం వున్నందున ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు అధికంగా ఈ టెలీగ్రామ్ యాప్ ను పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నాయి. అటు ప్రైవేటు విద్యాసంస్థలు కూడా ఎక్కువగా టెలీగ్రామ్ యాప్ వినియోగిస్తుండటంతో ప్రతీ మొబైల్ లోనూ వాట్సప్ తోపాటు, ఇపుడు టెలీగ్రామ్ యాప్ కూడా కనిపిస్తుంది. దానికితోడు త్వరలో గ్రూపు వీడియో కాలింగ్ ఫీచర్ కూడా అందుబాటులోకి వస్తుందనే ప్రచారం జరగడంతో ఇనిస్టాల్స్ మరింతగా పెరుగుతున్నాయి. అటు టెలీగ్రామ్ వెబ్ ద్వారా సిస్టమ్ కి కనెక్ట్ చేసుకొని సందేశాలు ల పంపుకోవడానికి ఈ యాప్ వాట్సప్ కంటే ఎంతో అనువైనదిగా వుంటుంది..

Mumbai

2020-10-11 17:32:56

మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు..

మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు...మల్లిజాజి అల్లుకున్న రోజూ...ఏదో చెప్పాలని...ఎంతో విప్పాలనీ అనే పాట గుర్తుందా మీకు...సరిగ్గా ఈ పాటకు తగ్గట్టుగానే ఈరోజు అంటే శనివారం 10.10.2020 రావడంతో ప్రపంచ వ్యాప్తంగా వున్న నెటిజెన్లు ఇది మళ్లీ మళ్లీ రాని రోజు అంటూ చిరంజీవి పాటను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాని తమ కామెంట్లతో షేక్ చేస్తున్నారు. నిజమే ఈ రోజు మళ్లీ రావాలంటే కష్టం కదా...అందుకే ఈ రోజు చాలా మందికి గుర్తుండిపోయేలా అంతా తమ వీకెండ్ ను ఎంజాయ్ చేస్తూ ఈ రోజును గుర్తించుకోవడానికి ప్లాన్ చేశారట. అందులోనూ ప్రభుత్వ ఉద్యోగులకు సెకెండ్ సాటర్ డే కూడా కావడంతో అంతా తమ వీకెండ్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేసుకున్నారు. ఇలాంటి యూనిక్ డే ని మిస్ చేసుకోకూడదంటూ తమ స్నేహితులకు వాట్సప్, టెలీగ్రామ్ రాయభారం కూడా సరిగ్గా..పది గంటల పది నిమిషాలకు పంపి ఆ స్క్రీన్ షాట్ ని అందరూ సరదాగా షేర్ చేసుకుంటున్నారు. ఏదైనా కొత్తగా ఆలోచించేవారికి మాత్రం ఈ తేది చాలా కావాల్సిన రోజనే చెప్పాలి. ఈరోజున కాస్త డిఫరెంట్ గా ఆలోచించేవారు ఏం చేశారో మరో 24 గంటలు గడిస్తే తప్పా సోషల్ మీడియా కోడై కూయదు...అంతేనా.. లేదంటే మరీ డిఫరెంట్ రాత్రి పదిగంటల పదినిమిషాలకి కూడా కొందరు డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు..

Visakhapatnam

2020-10-10 11:04:41

2020-09-24 13:02:28

2020-09-23 11:45:20

సాగర జలాలపై వీరోచితంగా ఇంద్రానేవి 2020 కవాతు...

రెండవ ప్రపంచ యుద్దంలో గెలుపుకి చిహ్నంగా  నిర్వహిస్తున్న11వ ఓడల కవాతు బే ఆఫ్ బెంగాల్ సెప్టెంబరు 4 నుంచి 5వ రకూ జరుగుతుందని ఇంద్రానేవి 2020 (ఇండియన్, రష్యా నేవి) పేర్కొంది. ఈమేరకు ఇరు దేశాలకు చెందిన నేవీ తమ కవాతు ఎంతో వీరోచితంగా ప్రదర్శిస్తున్నాయి.  ఈ నావికా కవాతు ద్వారా భారత్, రష్యా నేవీ యొక్క సామర్ధ్యాలను, స్నేహ సంబధాలను ప్రదర్శించడం ద్వారా తమ బలాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి అవకాశం వుంటుందని ఇదరు దేశాల నేవీలు ప్రకటించాయి. అంతేకాకుండా  ఇరుదేశాల  నేవీ  మధ్య ద్వైవార్షిక ద్వైపాక్షిక సముద్ర వ్యాయామం మరింత బలపడుతందని అభిప్రాయ పడింది. కాగా ఈ కవాతులో భారత రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ పాల్గొవలసి ఉండగా ఆయన ప్రస్తుతం మాస్కో పర్యటనలో ఉన్నారు. అయినప్పటికీ రెండ ప్రపంచ యుద్ధంలో వీరోచితంగా సాధించిన విజయానికి, జరుగుతున్న కవాతుకి తన సంఘీభావం తెలియజేశారు. కాగా భారత ప్రభుత్వం నిర్ధేశించిన కోవిడ్ 19 నిబంధనల మేరకు సముద్ర జలాలపై నిర్వహిస్తున్నారు. భారత నావికాదళానికి చెందిన హెలికాప్టర్లతో పాటు గైడెడ్ క్షిపణి డిస్ట్రాయర్ రణవిజయ్, స్వదేశీ యుద్ధనౌక సహ్యాద్రి, ఫ్లీట్ ట్యాంకర్ శక్తి తన కవాతను ప్రదర్శించినట్టు నావికా దళం ప్రకటించింది.

Bay of Bengal

2020-09-04 16:11:32

పబ్జీ నిషేదంపై తీవ్రంగా స్పందిచిన డ్రాగన్...

పబ్జీతో సహా 118 మొబైల్‌ యాప్‌లపై నిషేధం నిర్ణయంతో చైనా ఇన్వెస్టర్లు, సర్వీస్‌ ప్రొవైడర్ల చట్టబద్ధ ప్రయోజనాలను భారత్‌ ఉల్లంఘించిందని డ్రాగన్‌ తీవ్ర అసం తృప్తి వ్యక్తం చేసింది. భారత్‌ నిర్ణయం విచారకరమని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి గో ఫెంగ్‌ అన్నారు. చైనా మొబైల్‌ యాప్‌లను భారత్‌ నిషేధించడాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. దేశ భద్రతకు ముప్పుగా మారడంతో పాటు డేటా గోప్యత ఆందోళనలపై పబ్జీ సహా 118 చైనా యాప్‌లను భారత్‌ బుధవారం నిషేధిం చింది. ఒక్కరోజులోనే నిషేదంపై స్పందించిన భారత ప్రజలు లక్షల్లో యాప్ ని తొలగించారు. దీంతో చైనా తీవ్రంగా స్పందించింది. నిషేధిత మొబైల్‌ యాప్‌ల జాబితాలో బైడు, బైడు ఎక్స్‌ప్రెస్‌ ఎడిషన్‌, అలీపే, టెన్సెంట్‌ వాచ్‌లిస్ట్‌, ఫేస్‌యూ, విచాట్‌ రీడింగ్‌, క్యామ్‌కార్డ్‌ సహా పలు యాప్‌లున్నాయి. తాజా నిషేధంతో భారత్‌ నిషేధించిన చైనా యాప్‌ల సంఖ్య 224కు పెరిగింది. గతంలో జూన్‌ 29న టిక్‌టాక్‌, యూసీ బ్రౌజర్‌ సహా 59 చైనా యాప్‌లను ప్రభుత్వం నిషేధించగా భారత్‌-చైనా సరిహద్దుల్లో తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో పబ్జీ సహా 118 చైనా యాప్‌లపై భారత్‌ నిషేధించడం గమనార్హం. 

China

2020-09-03 15:01:13