జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి..గంట్ల


Ens Balu
2
విశాఖ కలెక్టరేట్
2020-09-14 13:21:24

ఆంధ్రప్రదేశ్ లోని వర్కింగ్ జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని డిమాండ్ చేస్తూ, ఏపి వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం విశాఖ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ధర్నానిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్లశ్రీనుబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇప్పటి వరకూ 600 మంది జర్నలిస్టులు కరోనా భారిన పడ్డారని, 20 మంది వరకూ ఈ వైరస్ కి బలైయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ తోమ్రుతి చెందిన వారికి రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, వైరస్ సోకిన జర్నలిస్టులకు రూ.25వేలు ఆర్ధిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా జర్నలిస్టుల కోసం జిల్లా అధికారిక వెబ్ సైట్ లలో ప్రత్యేకంగా వివరాలు నమోదు చేసే కార్యక్రమం చేపట్టాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ జర్నలిస్టులకు కరోనా పరీక్షలు చేయాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నవారికి రీఎంబర్సుమెంటు ఇవ్వాలన్నారు. అదేవిధంగా కొత్త అక్రిడేషన్లు మంజూరు చేయడంతోపాటు, హెల్త్ కార్డులను తక్షణమే రెవిన్యువల్ చేయాలన్నారు. హెల్త్ కార్డులు లేకపోవడం వలన చాలా మంది జర్నలిస్టుల కుటుంబ సభ్యులు కార్పోరేట్ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొన్ని సమయాల్లో డెలివరీలు, ఇతర స్కానింగ్ అవసరాలు కూడా తీరడం లేదని అన్నారు. జర్నలిస్టుల ఆరోగ్య భీమాని రూ.10 లక్షలకు పెంచుతూ, జర్నలిస్టులకు ఇస్తామన్న ఇళ్ల స్థలాల విషయంలోనూ ప్రభుత్వం నిర్ధిష్టమైన ప్రకటన చేయాలన్నారు. అనంతరం కలెక్టరేట్ లో వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నారాయణ్, కార్యదర్శి అనురాధ, ఏపీ బిజెఏ అధ్యక్షులు ఈరోతి ఈశ్వరరావు, అధిక సంస్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు...