ఏజెన్సీలో నల్లరాయికి కాళ్లు.. 5వషెడ్యూలులో పీసాచట్టానికి తూట్లు ..!


Ens Balu
14
g.madugula
2025-11-25 10:47:44

అల్లూరి మన్యం జిల్లాలో  రాజ్యాంగ బద్దంగా ఏర్పడిన చట్టాన్ని మైనింగ్ మాఫియా వెక్కిరిస్తోంది.. అధికారులకు, ఎన్జీటి(నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్)కి  సవాల్ విసురుతూ.. నల్ల రాయిని కొల్లగొడుతున్నా.. జిల్లా యంత్రాంగం మొద్ద నిద్ర వహిస్తున్నది.. ఏజెన్సీలో అటవీ ప్రాంతాన్ని చిన్నాభిన్నం చేస్తూ 5వ షెడ్యూల్ ప్రాంతంలోని పీసా చట్టానికి తూట్లు పొడుస్తూ..నల్లరాయిని మైదాన ప్రాంతానికి తరలిస్తూ కోట్లు కొల్లగొడుతున్నా మైనింగ్ మాఫియా నిర్వాహకులు.. అయితే కోట్ల రూపాయాల్లో జరుగుతున్న ఈ వ్యవహారంలో ఎవరికి అందాల్సింది వారికి అందిపోవడంతో అటు పాడేరు ఐటీడీఏ గానీ.. జిల్లాలోని రెవిన్యూ యంత్రాంగం గానీ నోరు మెదపడం లేదు.. గ్రామ రెవిన్యూ అధికారి నుంచి జిల్లా మైనింగ్ అధికారి వరకూ.. ఆర్డీఓ నుంచి జిల్లా కలెక్టర్ వరకూ ఎవరికి ఏమీ ఇవ్వాల్లో అందరికీ అన్నీ ఇచ్చాం కనుకనే ఎవరూ ఇంత పెద్ద మొత్తంలో క్వారీ తవ్వకాలు జరుగుతున్నా మాపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని నిర్వాహకులు బహిరంగంగానే చెబుతున్నారు..!

అల్లూరి మన్యం జిల్లాలోని జి. మాడుగుల మండలంలో జి.నిట్టపుట్టు, ఈదుల బంక గ్రామాల సమీపంలో భారీ నల్లరాయి కొండను మైనింగ్ మాఫియా యధేచ్చగా తవ్వేస్తున్నది. సింగర్భా పంచాయతీ పేరు మీద అనుమతులు తీసుకొని చుట్టు ప్రక్కల కొండలన్నీ కొల్లగొడుతున్నారు. అంతేకాదు ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇచ్చేశాం.. దమ్ముంటే మా మైనింగ్ ని ఆపండంటూ సవాల్ కూడా విసురుతున్నారు. ఈ  ప్రాంతంలో కొల్ల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి  కొందరు స్థానిక గిరిజనుల పేరుతో పీసా చట్టానికి తూట్లు పొడుస్తూ అడ్డగోలుగా అనుమనుతులు తీసుకున్నాడు. అందులో మైనింగ్ అధికారులు వాటా చాలా గట్టిదే. గతంలో ఈశ్వర్ అనే వ్యక్తి కూడా ఇక్కడ మైనింగ్ పెద్ద ఎత్తున నడిపేవారని స్థానికులు చెబుతున్నారు. ఈ మైనింగ్ కారణంగా అత్యధిక లోడుతో వెళుతున్న వాహనాల కారణంగా రోడ్లు దెబ్బ తింటున్నాయని.. ఈ ప్రాంతం మొత్తం క్వారీ బూడిదో పర్యావరణం పూర్తిగా దెబ్బ తింటున్నదని కూడా చెబుతున్నారు. అయితే అనధికారికంగా రెవిన్యూ, మైనింగ్ అధికారులందరికీ కలిసి కుమ్మక్కు గా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ నల్ల రాయి క్వారీ ద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం గండి పడుతున్నది. ఈ విషయంలో మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అనకాపల్లి మైనింగ్ అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడంతో ఏకంగా రూ.11 కోట్ల రూపాయలు అపరాద రుసుము విధించారు. అంటే ఒక్క క్వారీపై ఏకంగా రూ.11 కోట్లు అపరాద రుసుము విధించారంటే ఏ స్థాయిలో మైనింగ్ జరుగుతుందో అనుమతులు ఇచ్చిన రెవిన్యూ, మైనింగ్ అధికారులే చెప్పాల్సి ఉన్నది. విషయం రప్చర్ కావడంతో కొంత కాలం పనులు నిలిపివేసి.. ఇక్కడేమీ జరగడం లేదని నమ్మించి మళ్లీ ఇపుడు భారీ ఎత్తున తవ్వకాలు మొదలు పెడుతున్నారు.

-ఈరోజు-ఈఎన్ఎస్ పరిశీలనలో కళ్లు చెదిరే వాస్తవాలు
అదేమీ బందిపోట్లు.. దొంగలు.. గూండాలు ఉంటే ఏరియా కాకపోయినా.. క్వారీ చుట్టూ తుపాకులు పట్టుకొని పహారా కాస్తున్న వారు అక్కడక్కడా కనిపిస్తారు. క్వారీ లోనికి అధికారులకు కూడా అనుమతులు ఉండవు.. ప్రజాప్రతినిధులకు తెలిసినా ఫిర్యాదులు చేశాం కదా అన్నట్టుగానే ఉంటారు.. తుపాకులు పట్టుకున్నవారు ఎవరు అని ఎవరైనా ప్రశ్నిస్తే.. వాళ్లు మావోయిస్టులు కాబోలు అని.. ఆ నెపాన్ని.. మైనింగ్ తవ్వకాలనీ నిర్వాహకులు మావోయిస్టులపైకి తోసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈశ్వర్ పేరిట ఉన్న క్వారినీ..కె.సింహాద్రి పేరిట మార్చేసి.. మైనింగ్ అధికారులు, రెవిన్యూ అధికారుల అండదండటతో మళ్లీ క్వారీని త్వవేస్తున్నారు. గతంలో ఇదే క్వారిపై పోలీసు కేసులు నమోదై వాహనాలు స్టేషన్ లో పెట్టించినా.. అధికార, రాజకీయ పలుకుబడి వినియోగించి వాటిని బయటకు తీసుకెళ్లిపోయారు. ఇదంతా స్థానిక రెవిన్యూ, మైనింగ్ ఐటీడీఏ అధికారులకు తెలియకుండా జరుగుతుందంటే అది బూచీ కదలు చెబెతున్నట్టే లెక్క.

-500 కోట్ల నల్ల రాయి వ్యాపారం లక్ష్యం
అల్లూరి జిల్లాలోని రూ.500 కోట్ల నల్ల రాయి వ్యాపారమే లక్ష్యంగా అడ్డగోలుగా జరుగుతున్న ఈ మైనింగ్ దందాలో రెవిన్యూ అధికారులు, మైనింగ్ అధికారులు, పాడేరు ఐటీడీఏ అధికారులు, పీసీ కమిటీ, గ్రామ పంచాయతీ, లీజుదారులు.. ఆఖరికి మీడియా కూడా వాటాదారులేనట. దానికో ప్రత్యేక నిధిని కూడా కేటయించి ప్రశ్నించిన వారి నోటిని నోటుతో మూస్తూ వస్తున్నారు. ఇటీవలే నాలుగు శాటిలైట్ ఛానళ్లకు, మూడు ప్రధాన పత్రికలకు 15 యూట్యూబు ఛానళ్లకు పెద్ద మొత్తంలో కమిషన్లు ఇచ్చినట్టుగా చెబుతున్నారు. లేదంటే ఇంత పెద్ద స్థాయిలో మైనింగ్ మాఫియా చేస్తున్న ఈ అక్రమ నల్ల రాయి క్వారీపై నేటికీ మైనింగ్ అధికారులుగానీ రెవిన్యూ అధికారులు గానీ ఎందుకు నోరు మెదపడం లేదు..? గతంలో మైనింగ్ అధికారులు విధించిన అపరాద రుసుములు ఎగ్గొట్టి.. మళ్లీ మళ్లీ మైనింగ్ అనుమతులు పొంది యధేచ్చగా నల్లరాయిసి బాంబులతో పేల్చి మన్యంల భూమి కకావికలం చేయగలుగుతున్నారంటే ఎవరి వాటా ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన పనిలేదు.

-విశాఖలో సెటిల్ మెంట్లు.. వాళ్లే ప్రధాన బ్రోకర్లు
అల్లూరి జిల్లా.. జి.మాడుగుల మండలంలోని జి.నిట్టపుట్టు, ఈదుల బంక గ్రామాల సమీపంలో  అడ్డగోలుగా జరుగుతున్న నల్ల క్వారీ వ్యవహారాలు బయటకు రాకుండా ఉండేందుకు అధికారపార్టీలోని కొందరు పెద్దల పేర్లతో విశాఖకు చెందన కొందరు మీడియా నిర్వాహకులు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ మైనింగ్ విషయంలో ఏ వార్త బయటకు వచ్చినా.. వారికి తమదైన పాట పెట్టి వారి నోర్లు మూయిస్తున్నారు. అయితే ఈ మండలంలో జరుగుతున్న ప్రకృతి విధ్వంసంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించడానికి పర్యావరణ వేత్తలు ఆధారాలతో సహా సిద్దమవుతున్నారు. మరో ప్రక్క ఎవరి పేరుతో బినామీ క్వారీలు నడుస్తున్నోయో వివరాలు సేకరించి.. పీసా చట్టాన్ని ఈ ప్రాంతంలో ఏ విధంగా ఉల్లంఘించారు.. ఐవ షెడ్యూల్ లో పీసా చట్టాన్ని ఏ రకంగా నల్లరాయి తవ్వకాలకు మైనింగ్ మాఫియా రెవిన్య.. మైనింగ్ అధికారులు, ఐటీడీఏ అధికారు వద్ద తాకట్టు పెట్టారో మొత్తం వివరాలు సేకరించే పనిలో ఉంది. ఈ క్రమంలో ఈరోజు-ఈఎన్ఎస్ కూడా గ్రౌండ్ లెవల్ రిపోర్ట్ కూడా సేకరించింది. ఇక్కడ కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు బయటకు వచ్చాయి.. ఇదే విషయాన్ని మైనింగ్, రెవిన్యూ అధికారుల వద్ద ప్రస్తా విస్తే.. ఆ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్టు తమకు ఇప్పటి వరకూ ఎలాంటి ఫిర్యాదులు రాలేదని.. కాకపోతే గతంలో రూ.11 కోట్లు ఫైన్ వేసిన మాట వాస్తవమేనని జిల్లా మైనింగ్ అధికారులు పేర్కొనడం విశేషం.