జిల్లాలో శాశ్వత భూ హక్కు సర్వే పక్కాగా చేయాలి..
Ens Balu
4
Srikakulam
2021-11-06 10:52:49
శ్రీకాకుళంజిల్లాలో జగనన్న భూ సర్వే శాశ్వత భూ హక్కు కార్యక్రమంను గ్రామాల్లో పక్కాగా రీ సర్వే నిర్వహించాలని సర్వే శాఖ కర్నూల్ ప్రాంతీయ ఉప సంచాలకులు మరియు ప్రధాన శిక్షకులు ఎ. వెంకటేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ భూములు, దేవదాయ శాఖ భూములు, ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. భూతగాదాలకు తావులేకుండా రీ సర్వే సక్రమంగా జరిగి శాశ్వతంగా భూ హక్కు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ సక్రమంగా పనిచేయాలని వెంకటేశ్వరరావు సర్వేయార్లకు సూచించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం రీ సర్వే ఆపరేషన్స్ వర్క్ షాప్ మరియు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (SOP) పై శిక్షణ తరగతులు జరిగింది. డిప్యూటీ సర్వే ఇన్‌స్పెక్టర్లు, అన్ని మండలాల సర్వేయర్లు, గ్రామ సర్వేయర్ల రీ సర్వే కార్యకలాపాలకు శిక్షణ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, విజయనగరం సర్వే శాఖ సహాయ సంచాలకులు కె .ప్రభాకర్, టి.త్రివిక్రమ్, సర్వే తనిఖీఅధికారి కె.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.