సెల్ ఫోన్లు ఇచ్చారు సిమ్ కార్డులు మరిచారు..


Ens Balu
5
Kakinada
2021-11-07 05:46:49

తూర్పుగోదావరి జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళాపోలీసులకు ప్రభుత్వం విధినిర్వహణ నిమిత్తం సెల్ ఫోన్లు పంపిణీ చేసింది. అయితే సెల్ ఫోన్లు అయితే పంపిణీచేసింది తప్పితే అందులో వినియోగించే సిమ్ కార్డులు ఇవ్వకపోవడంతో రెండు నెలలుగా ఆ సెల్ ఫోన్లన్నీ మూలన పడి ఉన్నాయి. జిల్లాలో సుమారు 850 మంది మహిళా పోలీసులకు ప్రభుత్వం సెల్ ఫోన్లు పంపిణీ చేసింది. ఫోన్లలో వినియోగించేందుకు గ్రూప్ సిమ్ కార్డులు పంపిణీ మాత్రం చేపట్టలేదు. ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించే సెల్ ఫోన్లు కావడంతో వాటిని మహిళా పోలీసులు అలాగే ఇంట్లో ఓ మూలన భద్రంగా దాచిపెట్టి ఉంచారు. అటు జిల్లా అధికారులు సైతం ప్రభుత్వం నుంచి సిమ్ కార్డుల విషయమై ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు.