నేడు స్పందన కార్యక్రమం రద్దు..


Ens Balu
3
Srikakulam
2021-11-07 13:01:49

శ్రీకాకుళంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని నేడు రద్దు చేసినట్లు జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన జారీచేసారు. గత కొన్ని వారాలుగా ప్రతి సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో  స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, ప్రజల నుండి ఆర్జీలను స్వీకరిస్తున్న సంగతి విదితమే. అయితే జిల్లాలో ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున నవంబర్ 8న జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్న స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడం లేదన్నారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, వ్యయప్రయాసల కోర్చి ప్రజలు జిల్లా ప్రధాన కేంద్రానికి చేరుకోవద్దని ఆయన ఆ ప్రకటనలో కోరారు.