ఇక సురక్షితంగా పాపికొండల జల యాత్ర..
Ens Balu
5
Rajahmundry
2021-11-07 13:16:01
చారిత్రాత్మక రాజమహేంద్రవరం నగరంలో సుమారు రూ. 70 లక్షలతో ప్లోటింగ్ రెస్టారెంటు ప్రారంబించుకోవడం శుభపరిణామమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఆయన స్దానిక పద్మావతి ఘాట్ వద్ద బోటు ప్లోటింగ్ రెస్టారెంటును ఆయన ప్రారంబించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గోదావరి అందాలను ఇష్టపడని తెలుగు వారు ఉండరని, స్దానికంగా ఉన్న సాహితీ వేత్తలు గోదావరి అందాలపై చక్కటి పుస్తకాలు రచించారని కొనియాడారు. రాజమహేంద్రవరం ఒక పురాతన సాహితీ నగరంగా విరాజిల్లుతోందన్నారు. గోదావరి నదికి ఇరువైపులా పర్యాటక రంగ అభివృద్దికి అవకాశాలు మెండుగా వున్నాయని ఇటీవల కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ వారు నిర్వహించిన సమావేశంలో గొదావరి నది ప్రాంత పర్యాటక రంగ అభివృద్దికై పలు ప్రతిపాదనలు సమర్పించడం జరిగిందన్నారు. ఇన్వెస్టరు ప్రెండ్లీ పాలసీ విదానం పునరుద్దరించడం జరిగిందని దీనిద్వారా ప్రభుత్వ, ప్రవేట్ భాగస్వామ్యంతో రిసార్టు నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని పిచ్చుకలంక రిసార్డును సుమారు రూ 250 కోట్లతో త్వరలో పిపిటి విధానంతో నిర్మాణం చేపడతామన్నారు. 95 మంది సభ్యులు కెపాసిటి గల ప్లోటింగ్ రెస్టారెంటు ప్రారంభం అయిందని త్వరలో అన్ని చోట్ల ప్లోటింగ్ రెస్టారెంట్ల విదానాన్ని అమలు చేస్తామన్నారు. పర్యాటక రంగ అభివృద్దికి మన రాష్ట్రంలో 945 కిలోమీటర్లు పొడవుగల సముద్రతీరం, జీవనదులు ఉన్నాయన్నారు. అడ్వంచర్ టూరిజం టెంపుల్ టూరిజంల్లో. అభివృద్దికి అవకాశాలు ఎక్కువగా వున్నాయన్నారు. రాష్ట్రంలో మూడు చోట్ల సీప్లేన్ సౌలభ్యాన్ని అందుబాటులోనికి తెచ్చేందుకు చర్యలు ప్రతిపాదించామన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవాలయాలు మనకు ఉన్నాయన్నారు.13 జిల్లాలను పర్యాటక రంగ అభివృద్దికై నాలుగు సర్క్యుట్లుగా విభజించడం జరిగిందన్నారు. పలు దేవాలయాల్లో ప్రసాదం స్కీము అమలు దిశగా చర్యలు చేపట్టి ప్రతిపాదనలు రూపొందించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 6 విమానాశ్రయాలు, రైల్ మార్గాలు, జాతీయ రహదారులు కనెటివిటీలు విసార్తంగా ఉన్నాయన్నారు. విశాఖలో టూరిస్టుల కోరకు ఒక జెట్టీని ఏర్పాటు చేయడం జరుగుతోందని త్వరలో ప్రారంబించడం జరుగుతుందన్నారు. ఇన్వెస్టరు ప్రెండ్లీ పాలసీ విదానంలో పెట్టుబడి దారులను పిపిటి విదానం ద్వారా ఆహ్వానించడం జరుగుతోందన్నారు. పెట్టుబడి దారులు ప్రాజెక్టు ప్రారంభం నాటినుంచే లీజ్ చెల్లించాల్సి వుంటుందన్నారు. అంతర్జాతీయ టూరిజం చార్డులలో ఎపిని నిలపాలనే తపనతో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. సీని షూటింగ్‌లకు మోక్షానికి అనువైనా ప్రాంతంగా గోదావరి ప్రాంతం విరాజిల్లుతోందన్నారు. గోదావిరి పాపికొండలు విహార యాత్రకు 11 బోట్లను అనుమతి ంచడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 29 రకాలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను కోట్లాది నిధులు వెచ్చించి నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతోందన్నారు బోట్ల సామర్ద్యాలను పరిగణనలోనికి తీసుకొని అనుమతులు ఇవ్వండం జరుగుతోందన్నారు.గోదావరి ప్రాంత పర్యాటకరంగ అభివృద్దికి పార్లమెంటు సభ్యులు వారి ఆకాంక్షకు అనుగుణంగా పలు ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ గోదావరి పాత రైల్వే హెవలాక్ బ్రిడ్జ్ ఇతర ప్రాంతాలలో పర్యాటక రంగ అభివృద్దికి అవకాశాలను పరిగణనలోనికి తీసుకొని నిధులు కేటాయించాలని మంత్రిని కోరారు. నగర కమీషనరు అభిషిక్త్ కిశోర్ మాట్లాడుతూ రెస్టారెంటు మంచి ఆదాయ వనరుగా నిలుస్తుందని,,నగరంలో పురాతన కట్టడాలు అభివృద్దికి నగర ఆర్దికాబివృద్దికి పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వెల్లడిరచారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ది సంస్ద చైర్మన్ ఎ వరప్రసాదరెడ్డి, రుడా చైర్మన్ షర్మిళారెడ్డి, జె.సి.ఎ భారవతేజ,సబ్ కలెక్టరు ఇలాక్కియా ఇడి మాల్ రెడ్డి వీరనారాయణ, వెంకటాచలం, తదితరులు పాల్గొన్నారు.