విశాఖజిల్లాలో స.హ.చట్టం అమలు పరిశీలన..
Ens Balu
4
Visakhapatnam
2021-11-08 17:23:25
విశాఖజిల్లాలో సమాచార హక్కు చట్టం అమలు తీరును పరిశీలిస్తామని రాష్ట్ర సమాచార హక్కుచట్టం కమిషనర్ రేపాల శ్రీనివాసరావు తెలియజేసారు. సోమవారం జిల్లాలో పర్యాటనకు వచ్చిన సమాచార హక్కు చట్టం కమిషనర్ రేపాల శ్రీనివాసరావును, డి ఆర్.ఓ శ్రీనివాసమూర్తి, ప్రత్యేక ఉపకలెక్టర్ రంగయ్య, కలెక్టరేట్ పరిపాలనా అధికారి రామోహన్ రావు , తహశీల్దార్ జ్నానవేణి, డిప్యూటి డైరక్టర్ సమాచార పౌర సంబంధాల శాఖ సర్క్యుట్ హౌస్ లో కలిసారు. ఈ సందర్భంగా కమిషనరు జిల్లాలో సమాచార హక్కు చట్టం అమలు సంబంధిత విషయాలపై జిల్లా రెవెన్యూ అధికారి ను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో అధికారులతో ఈ విషయంపై సమీక్ష సమావేశం, అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేసారు.