మత్స్యకారుల అభివ్రుద్ధే ప్రభుత్వ లక్ష్యం.. ఫిషరీష్ డిడి నిర్మలకుమారి


Ens Balu
6
Pachipenta
2021-11-09 15:53:55

మత్స్యకారుల ఆర్ధిక అభివ్రుద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అనేకచర్యలు చేపడుతుందని  విజయనగరం జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి అన్నారు. మంళవారంవారం విజయనగరం జిల్లాలోని చేప పిల్లల పెంపక కేంద్రాల నుంచి తీసుకు వచ్చిన 2.44.లక్షలు చేప పిల్లలను, పాచిపెంట మండలం కొండికనలవలస పెద్దగెడ్డ రిజర్వాయర్ లో వదిలిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ఆహ్వానితులతో కలిసి మాట్లాడారు. ప్రభుత్వం మత్స్య సంపదను అభివ్రుద్ధిచేసి తద్వారా మత్స్యకారులను ఆర్ధికంగా బలోపేతం చేయడానికి చేప పిల్లల పెంపకాన్ని చేపడుతుందన్నారు. జిల్లాలోని అన్ని రిజర్వాయర్ లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో చేప పిల్లలను రిజర్వాయర్ లో వదిలిపెట్టామన్నారు. చేపల వినియోగాన్ని పెంపకాన్ని మరింత పెంచాలనే మత్స్యశాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ కార్యక్రమాలు చేపడుతన్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీలు, మత్స్యశాఖ సిబ్బంది, అధిక సంఖ్యలో మాత్సకారులు పాల్గొన్నారు.