ఎమ్మెల్సీ ఎన్నికలకై నోడల్ అధికారుల నియామకం..
Ens Balu
7
Vizianagaram
2021-11-11 16:25:31
విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వివిధ అంశాలను పర్యవేక్షించేందుకు నోడల్ ఆఫీసర్లను నియమిస్తూ కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయా నోడల్ అధికారికి కేటాయించిన విభాగాన్ని పేర్కొంటూ గురువారం ప్రత్యేక ఉత్వర్వులు జారీ చేశారు. సిబ్బంది కేటాయింపు, సర్దుబాటు అంశాలను పర్యవేక్షించేందుకు జాయింట్ కలెక్టర్ జె. వెంకటరావును, రవాణా వ్యవహారాలు చూసేందుకు మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్‌ను, ఎన్నికల సిబ్బంది శిక్షణ, ఎన్నికల ఖర్చు తదితర అంశాలను పరిశీలించేందుకు కో-ఆపరేటివ్ ఆడిట్ అధికారి ఎస్. అప్పలనాయుడును, ఎన్నికల సామాగ్రి, ఇతర ఏర్పాట్లను చూసుకునేందుకు మెప్మా ప్రాజెక్ట్ అధికారి బి. సుధాకర్‌ను, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు తీరును పరిశీలించేందుకు సీపీవో జె. విజయలక్ష్మిని, ఎన్నికల పర్యవేక్షణ అధికారిగా డీఎస్‌వో ఎ. పాపారావును, శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు అదనపు ఎస్పీ పి. సత్యనారాయణను, బ్యాలెట్ పేపర్, డమ్మీ బ్యాలెట్ వ్యవహారాలను చూసేందుకు జిల్లా టూరిజం అధికారి వర్మను, మీడియా వ్యవహారాలు పర్యవేక్షిందుకు సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు డి. రమేష్‌ను నియమించినట్లు కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయా నోడల్ అధికారులందరూ సమన్వయంతో పని చేసి ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించాలని కలెక్టర్ సూర్యకుమారి సూచించారు.