విశాఖలో రేపు విజెఎఫ్‌ ప్రతిభకు ప్రోత్సాహం..


Ens Balu
4
DABA GARDENS
2021-11-12 08:14:00

వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రతిభకు ప్రోత్సాహం కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించనున్నట్లు ఫోరం అధ్యక్ష,కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, ఎస్‌.దుర్గారావులు తెలిపారు. శుక్రవారం విశాఖలోని డాబాగార్డెన్స్‌ విజెఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో  వీరు మాట్లాడుతూ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఏయూ వైవిఎస్‌ మూర్తి ఆడిటోరియంలో వివిధ విభాగాలకు చెందిన జర్నలిస్టులకు అతిథులు చేతుల మీదుగా మీడియా అవార్డులను ప్రధానం చేయడం జరుగుతుందన్నారు. కపిల గోపాలరావుతో పాటు,వివిధ కేటగిరీల్లో అవార్డులు ప్రధానం చేస్తామన్నారు. జర్నలిస్టుల పిల్లలకు సుమారు 120 మందికి ఉపకార వేతనాలను అందజేస్తామన్నారు. ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన పిల్లలకు నగదు,మెమోంటో, ప్రశంసాపత్రం అందజేస్తామన్నారు. 14వ తేది ఉదయం నుంచి మధ్యాహ్నాం విందు భోజనం వరకూ జరిగే ఆయా కార్యక్రమాల్లో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని వీరు కోరారు.  జర్నలిస్టుల సంక్షేమానికి తమ పాలకవర్గం అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఇటీవలే ఇంటర్‌ మీడియా స్పోర్ట్స్‌ మీట్‌ను విజయవంతంగా ముగించుకోవడం జరిగందని, ఆ తరువాత దీపావళి పండగను అత్యంత వేడుకుగా నిర్వహించామన్నారు. భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు.  మీడియా అవార్డుల కమిటీ చైర్మన్‌ ఆర్‌.నాగరాజు పట్నాయక్‌ మాట్లాడుతూ అవార్డుల ఎంపికకు సంబంధించి వివిధ అసోసియేషన్ల సహకారం తీసుకున్నామన్నారు. అంతే కాకుండా చిన్న,పెద్ద పత్రికలతో పాటు ఫోటో,వీడియో, క్రైం జర్నలిస్టులకు, న్యూస్‌ రీడర్స్‌లకు ప్రాధాన్యతనివ్వడం జరిగిందన్నారు. అవార్డు పొందిన వారికి అతిధులు చేతుల మీదుగా సత్కరించడంతో పాటు, నగదు, జ్ఞాపికతో పాటు వివిధ రకాల బహుమతులు అందజేస్తామన్నారు. కపిలగోపాలరావు అవార్డుతో పాటు మరో 31 మందికి వేర్వేరు కేటగిరీల కింద అవార్డులను అందజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేయనున్నాయి. ఈ సమావేశంలో విజెఎఫ్‌ జాయింట్‌ సెక్రటరీ దాడి రవికుమార్‌,కార్యవర్గ సభ్యులు ఎంఎస్‌ఆర్‌ ప్రసాద్‌,ఇరోతి ఈశ్వరరావు, పైలా దివాకర్‌,డేవిడ్‌రాజు, గయాజ్‌, దొండా గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.