శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో న‌వ‌గ్ర‌హ హోమం..


Ens Balu
6
Tirupati
2021-11-12 08:39:20

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం న‌వ‌గ్ర‌హ హోమం శాస్త్రోక్తంగా జ‌రిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మ‌హోత్స‌వాలు నిర్వహిస్తున్నారు.  ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం నవగ్రహహోమం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, నవగ్రహ కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీ కామాక్షి అమ్మ‌వారి కలశస్థాపన, విశేష దీపారాధన చేపట్టనున్నారు. హోమ మ‌హోత్స‌వాల్లో భాగంగా న‌వంబ‌రు 13 నుండి 21వ తేదీ వ‌ర‌కు శ్రీ కామాక్షి అమ్మ‌వారి హోమం(చండీ యాగం) జ‌రుగ‌నుంది. ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో  సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్  భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్  రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.