జిల్లాలో టిబి కేసులు గుర్తించాలి..


Ens Balu
6
Srikakulam
2021-11-12 14:27:10

శ్రీకాకుళం జిల్లాలో టిబి కేసులను గుర్తించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు ఆదేశించారు. క్షయ నివారణ పై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విస్తృతంగా సర్వే నిర్వహించి క్షయవ్యాధితో బాధపడుతున్న వారిని గుర్తించాలని స్పష్టం చేశారు. గుర్తించడం వలన అవసరమైన మందులు అందించుటకు చర్యలు చేపట్టవచ్చని చెప్పారు. టిబి నివారణ అధికారి ఎన్.అనురాధ మాట్లాడుతూ జిల్లాలో క్షయ వ్యాధి గుర్తించుటకు అన్ని చర్యలు చేపట్టామని అన్నారు. జిల్లాలో 12 టిబి యూనిట్లు, 31 కఫ పరీక్ష కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. క్షయ వ్యాధి నివారణలో భాగస్వామ్యం అవుతున్న ఆశా కార్యకర్తలకు పారితోషికం కూడా అందించడం జరుగుతుందని అనురాధ తెలిపారు. సి బి నాట్ వాహనాల ద్వారా సర్వే చేయడం జరిగిందని చెప్పారు. 35 వేల 752 మందికి స్క్రీన్ చేయగా 245 మందికి పరీక్షలు నిర్వహించడం జరిగిందని, అందులో ఏడు కేసులు గుర్తించడం జరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి.జగన్నాథరావు, అదనపు డిఎంహెచ్ చ్ఓ కె. రామమూర్తి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కృష్ణ మోహన్, లీలా, అప్పారావు, జెమ్స్ ఆస్పత్రి ఆర్.ఎం. ఓ పి. తిరుపతిరావు, బెజ్జిపురం యూత్ క్లబ్ అధ్యక్షులు ఎమ్. ప్రసాదరావు, క్షయ వ్యాధి నివారణ కమిటీ గౌరవ కార్యదర్శి మంత్రి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.