గిరిజన యువత కోసం త్వరలోనే మెగా జాబ్ మేళా.. ఎస్పీ రవీంధ్రనాధ్ బాబు


Ens Balu
14
Kakinada
2021-11-14 17:15:28

తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు ఏఓబీ ప్రాంతంలోని గంజాయి సాగు, ఇతర వ్యవహారాల్లో చిక్కుకున్న గిరిజన యువతను సన్మార్గంలో పెట్టేందుకు త్వరలోనే మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాధ్ బాబు తెలియజేశారు. ఆదివారం కాకినాడలో తన కార్యాలయంలో ఎస్పీ మీడియాతో మాట్లాడారు. గంజాయి స్మగ్లర్లు ఇచ్చే కొద్దిపాటి డబ్బుకు ఆశపడే గిరిజన యువత ఈ అక్రమ రవాణాకు సహకరించి వారి జీవితాలను నాశం చేసుకుంటున్నారని అన్నారు. పరివర్తన కార్యక్రమంలో భాగంగా మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే గిరిజన ప్రాంతాలు ఆపైన ఏఓబీ ప్రాంతాల్లో వుండే గిరిజన యువత వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఈ ప్రక్రయ పూర్తికాగానే త్వరలోనే జాబ్ మేళా నిర్వహించి గిరిజన యువతకు ఉపాది అవకాశాలు కల్పించనున్నట్టు ఎస్పీ వివరించారు. ఇప్పటికే జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల పరిధిలోని పోలీస్ స్టేషన్ల ఎస్ఐల తో మాదక ద్రవ్యాల మత్తు, వ్యాపారాలు వదిలిపెట్టే విధంగా యువతకు ప్రత్యేక కౌన్సిలింగ్ లు ఆయా స్టేషన్ ల ఎస్ఐ లద్వారా ఇప్పిస్తున్నామని ఎస్పీ రవీంధ్రనాధ్ బాబు ఈ సందర్భంగా మీడియా కివివరించారు.