ఘోషా ఆసుపత్రిలో ప్రధాని జన్మదిన సేవా సప్తాహం..
Ens Balu
2
ఘోషా ఆసుపత్రి
2020-09-14 14:56:35
భారదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళుతున్న ప్రధాని నరేంద్రమోడి జన్మదిన వేడుకలు విశాఖ దక్షిణ నియోజకవర్గం కన్వీనర్ కొప్పల రామ్ కుమార్ ఆధ్వ ర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం ఈ సందర్భంగా ఘోషా ఆసుపత్రిలోని సిబ్బందికి, రోగుల బంధువులకు, సెక్యూరిటీ సిబ్బందికి ఆహారంతోపాటు, ఫేస్ మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్రమోడీ మేకిన్ ఇండియా నినాదంతో ఎందరో భారతీయులు దేశానికి ఉపయోగపడేవిధంగా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. ఆయనను స్పూర్తిగా తీసుకొని తమవంతు సేవా కార్యక్రమాలు చేయాలనే లక్ష్యంతో పేదలకు ఆహారం పంపిణీ, మాస్కులు, ఇతర సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ప్రధాని మోడి జన్మదిన వేడుకలు, సేవా సప్తాహం పేరుతో ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకూ నిర్విరామంగా సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఆయన వివరించారు. ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి బీజేపి నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి రావడం విశేషమని ఆయన కొనియాడారు.