ఎస్పీ ఆఫీస్ కి ఐటీసీ 2 జనరేటర్లు వితరణ..


Ens Balu
7
Kakinada
2021-11-15 08:57:13

తూర్పుగోదావరి జిల్లాలోని జిల్లా ఎస్పీ కార్యాలయానికి ఐటిసీ సంస్థ రెండు పవర్ జనరేటర్లు వితరణ చేసిందని జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్ర నాధ్ బాబు తెలియజేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన కాకినాడలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఐటీసీ సంస్థ ప్రతినిధులు ఫణిభూషన్, రవికాంత్ లు వీటిని జిల్లా కార్యాలయంలో అందజేశారని చెప్పిన ఆయన వీటిని కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా అందజేశారన్నారు. అత్యవసర సమయంలో ఈ పవర్ జనరేటర్లు జిల్లా కార్యాలయానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఎస్పీ ఈ సందర్భంగా వివరించారు. జనరేటర్లు అందించిన సంస్థ ప్రతినిధులను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ కరణం కుమార్ , పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.