బందోబస్తు పర్యవేక్షించిన ఎస్పీ రవీంద్రనాధ్ బాబు..
Ens Balu
11
Kakinada
2021-11-15 09:17:02
తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ పట్టణంలో సోమవారం జరుగుతున్న నగరపాలక సంస్థ ఉపఎన్నికల బందోబస్తును జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు స్వయంగా పరిశీలించారు. కాకినాడలోని 3, 9, 16, 30 డివిజన్ల కార్పోరేటర్ల ఎన్నికల వద్ద పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతోందన్నారు. ఏ డివిజన్ లో అయినా ఎన్నికల నియామవళిని ఎవరు ఉల్లంఘించినా తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ బందోబస్తు అధికారులకు సూచించారు. ప్రశాంత వాతవారణంలో ఎన్నికలు పూర్తిచేయడానికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన విధంగా భౌతిక దూరం పాటిస్తూ ఎన్నికల్లో పాల్గొనాలని ఎస్పీ ఈ సందర్భంగా ఓటర్లకు సూచించారు. ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ కరణం కుమార్ తదితరులు పాల్గొన్నారు.