తూర్పుగోదావరి జిల్లాలో మాస్కులేకుండా తిరుగుతున్నవారిపై 166 కేసులు నమోదు చేసి 16వేల 600 రూపాయలు అపరాద రుసుము వసూలు చేసినట్టు జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు తెలియజేశారు. దీనితో ఈ సంవత్సరం మార్చి 26 నుంచి నవంబరు 15వ తేదీ వరకూ ఒక లక్షా 69వేల 692 చాలనాలు విధించామన్నా ఎస్పీ వాటి ద్వారా ఒక కోటి 48 లక్షల 62 వేల 180 రూపాయలు అపరాద రుసుము వసూలు చేసినట్టు చెప్పారు. వాహనదారులు తప్పని సరిగా మాస్కుధరించి మాత్రమే ప్రయాణాలు చేయాలన్నారు. అలాకాకుండా నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు తప్పవని ఎస్పీ రవీంధ్రనాధ్ బాబు హెచ్చరించారు.