ప్రతిభ చూపిన గిరిజన విధ్యార్ధులకు సత్కారం..
Ens Balu
7
Vizianagaram
2021-11-16 06:22:35
జేఈఈ అడ్వాన్స్‌డ్, జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరిచి ఉత్తమ ర్యాంకులు సాధించిన గిరిజన విద్యార్థులను కలెక్టర్ ఎ. సూర్యకుమారి, ట్రైబెల్ వెల్ఫేర్ డైరెక్టర్ రంజత్ భాషా, ఐటీడీఏ పీవో కూర్మనాథ్, జేసీ మయూర్ అశోక్ సత్కరించారు. కురుపాం ట్రైబెల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలో చదివిన వీరు తాజాగా జరిగిన జేఈఈలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. జేఈఈ మెయిన్స్‌లో 4988 ర్యాంకు సాధించిన మచ్చా స్వాతికి బిలాస్‌పూర్ ఎన్.ఐ.టి.లో కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో సీటు రాగా, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 341 ర్యాంకు సాధించిన వి. లావణ్య కేరళలోని పాలక్కడ్ ఐఐటీలో మెకానికల్ విభాగంలో సీటు వచ్చింది. మంగళవారం వారిని పిలిపించుకొని కలెక్టర్ తన ఛాంబర్‌లో దుస్సాలువాలతో సత్కరించారు. పుష్ప గుచ్ఛాలు అందజేసి అభినందించారు. మరింత పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూర్యకుమారి ఆకాంక్షించారు. కార్యక్రమంలో ట్రైబెల్ వెల్ఫేర్ డైరెక్టర్ రంజిత్ భాషా, పార్వతీపురం ఐటీడీఏ పీవో ఆర్. కూర్మనాథ్, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) మయూర్ అశోక్, ట్రైబెల్ వెల్ఫేర్ డీడీ కె. కిరణ్ కుమార్, కురుపాంలోని ఏపీ ట్రైబెల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల కన్వీనర్ ప్రిన్సిపాల్ ఎం. రాధాకృష్ణ, ప్రిన్సిపాల్ ఎ. సత్యవతి తదితరులు పాల్గొన్నారు.