వీరాసనంలో శ్రీ అభయాంజనేయ స్వామి..
Ens Balu
10
Visakhapatnam
2021-11-16 06:29:34
విశాఖ మహానగరంలోని జాతీయ రహదారిపై సూర్యనగర్లో వేంచేసిఉన్న శ్రీ యోగ సిద్ధాంజనేయ స్వామి వారు కార్తీక మాసం రెండవ మంగళవారం సందర్భంగా వీరాసనంలో అభయాంజనేయ స్వామిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు ఏ.శ్రీకాంత్, ఏ శ్రీహర్షలు శ్రీ పాంచరాత్ర ఆగమ సాంప్రదాయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ స్వామి వారిని తమలపాకులమాల వడమాల గజమాల వివిధపూల మాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి సింధూరఅర్చన శ్రీరామఅష్టోత్తరం చేశారు. ఆలయ వ్యవస్థాపకులు పెనుమత్స సుబ్బరాజు తొలి పూజలో పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.