ఈనె 20 నుంచి దూరవిద్య డిగ్రీ తరగతులు..
Ens Balu
5
Kakinada
2021-11-17 06:34:55
ఆంధ్రాయూనివర్శిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ 2020-2021 విద్యాసంవత్సరానికి వారంతపు తరగతుల షెడ్యూల్ ను విడుదల చేసిందని సర్పవరంలోని రాజీవ్ గాంధీ డిగ్రీకాలేజి మరియు స్టడీ సెంటర్ నిర్వహాకులు ఎన్.సూరిబాబు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ మేరకు బుధవారం కాకినాడలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. నవంబరు 20, 21,27, 28 మరియు డిసెంబరు నెలలో 4, 5, 11, 12, 18, 19 తేదీలో బీఏ, బీకాం కోర్సులు చదువుతున్న మొదటి, రెండవ, మూడవ సంవత్సరం విద్యార్ధులు కాకినాడ రూరల్ పరిధిలోని రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజీలో జరిగే తరగతులకు హాజరు కావాల్సి వుంటుందన్నారు. అభ్యర్ధులు తమ గుర్తింపు కార్డుతో వారాంతపు తరగతులకు హాజరు కావాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా విద్యార్ధులు తమ వార్షిక ట్యూషన్ ఫీజు డిసెంబరు 15 లోపు స్టడీ సెంటర్ లోగానీ, ఆన్ లైన్ ద్వారా గానీ చెల్లించాలన్నారు. డిసెంబరు 15 దాటితే డిసెంబరు 30వ తేదీ లోపు 200 రూపాయలు అపరాద రుసుముతో చెల్లించాల్సి వుంటుదని పేర్కొన్నారు. విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.