నృసింహ దీక్షలను విజయవంతం చేయాలి..


Ens Balu
5
Simhachalam
2021-11-17 10:01:11

విశాఖలోని సింహచలం శ్రీశ్రీశ్రీ వరహాలక్ష్మీ నృసింహ స్వామి అత్యంత మహిమాన్వితుడని, భక్తులు కోరుకొన్న కోర్కెలు తీర్చే స్వామిగా కీర్తింపబడుతున్నారని సింహచలం దేవస్ధానం ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు  గంట్ల శ్రీనుబాబు అన్నారు. బుధవారం సింహద్రినాధుని దర్శించుకున్న అనంతరం జనవరి 13న జరగనున్న వైకుంఠ ఏకదశి ఏర్పాట్ల సమావేశంలో పాలొన్నారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మీడియాతో మాట్లడుతూ, సింహగిరిపై ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న నృసింహ దీక్షలను విజయవంతం చేయాలని భక్తులను కోరారు. ఈ నెల18 నుంచి మండల దీక్షలు ప్రారంభమవుతాయని, అవి వచ్చే నెల 29 నాటికి ముగిస్తాయన్నారు. ఇక 32 రోజుల దీక్షలకు సంబంధించి ఈ నెల 26న ప్రారంభం కానున్నాయని,వచ్చే నెల 29తో ముగిస్తాయన్నారు.నృసింహదీక్షల భక్తులకు సంబంధించి ఆలయ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీనుబాబు తెలిపారు. కావున ఆయా దీక్షలకు దేశ వ్యాప్తంగా మరింత విస్తృత ప్రచారం కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.హిందూ ధర్మ ప్రచారానికి ప్రతి ఒక్కరూ పాటుపడాల్సిందేనన్నారు.వైకుంఠ ఏకాదశి, సంక్రాంతి వరుసుగా రావడంతో అప్పన్న ఆలయానికి భక్తులు తాకిడి గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు.