జర్నలిస్టులకు ఆదివారం వన సమారాధన..


Ens Balu
3
కాకినాడ రూరల్
2021-11-17 15:38:23

ది కాకినాడ జర్నలిస్ట్ మ్యూచువల్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో కాకినాడ, కాకినాడ రూరల్ పరిధిలోని జర్నలిస్టుల కుటుంబాలతో 21వ తేదీ ఆదివారం కార్తీక వన సమారాధన ఏర్పాటు చేసినట్టు కార్యక్రమం కన్వీనర్ స్వాతి ప్రసాద్ తెలియజేశారు. ఈ మేరకు బుధవారం కాకినాడ రూరల్ లో ఆయన మీడియాకి ప్రకటన విడుదల చేశారు. కొవ్వాడ రైల్వే స్టేషన్ ప్రక్కన మురళిగారి తోటలో ఈ వన సమారాధన ఏర్పాటు చేశామన్నారు. జర్నలిస్టుల సంఘాలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమంలో జర్నలిస్టులంతా కుటుంబ సమేతంగా పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమానికి అధ్యక్షులుగా ఎల్.శ్రీనివాస్, ప్రోగ్రామ్ కో-కన్వీనర్ గా మంగా వెంకట శివరామక్రిష్ణలు వ్యవహరిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.