కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ నోటా ఓట్లు 194


Ens Balu
6
Kakinada
2021-11-17 16:59:15

కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో నాలుగు నాలుగు డివిజన్ లలో 194 ఓట్లు నోటాకి ఓట్లు పోలవడం అధికారులకే ఆశ్చర్యాన్ని కలిగించింది. బుధవారం కాకినాడలో ఎన్నికల అధికారి ప్రకటించిన ఫలితాల్లో అత్యధికంగా  3వ డివిజన్ లో88, 9వ డివిజన్ లో 36, 30వ వార్డులో 45, 16వ వార్డులో 25 ఓట్లు నోటాకి పోలయ్యాయి. ఈ నోటా ఓట్ల పరంపర పంచాయతీ ఎన్నికల నుంచి మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల వరకూ పోలవడం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశం అవుతుంది. అభ్యర్ధులకి వచ్చిన మెజార్టీని ఏ విధంగా చెప్పుకుంటున్నారో..అదే స్థాయిలో నోటాకి పోలైన ఓట్ల సంగతి కూడా జిల్లా కేంద్రంలో అదేవిధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.