పోలీసు వాహనాలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ..


Ens Balu
8
Kakinada
2021-11-18 07:19:57

ఏపీ పోలీస్ రాష్ట్ర కార్యాలయం నుంచి తూర్పుగోదావరి జిల్లాకి కేటాయించిన రెండు ఐషర్ వాహనాలను జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు ప్రారంభించారు. గురువారం ఈ మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో వీటిని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లా పోలీసు సిబ్బంది విధి నిర్వహణకు ఈ వాహనాల సేవలను ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కరణం కుమార్, డిఎస్పీ అంబికా ప్రసాద్, ఏఆర్ డిఎస్పీ అప్పారావు, ఆర్ఐ వెంకట అప్పారావు తదితరులు పాల్గొన్నారు.