జగనన్న గ్రుహ హక్కుపై అవగాహన కల్పించండి..ఎంపీడీఓ కె.స్వప్న


Ens Balu
3
Karapa
2021-11-18 09:46:10

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ‌పెట్టిన జ‌గ‌న‌న్న గృహ‌హ‌క్కు ప‌థ‌కం గృహ‌నిర్మాణ ల‌బ్దిదారుల‌కు ఎంతో ప్రయోజ‌న‌క‌ర‌మ‌ని, ఈ ప‌థ‌కం ద్వారా వారు త‌మ గ్రామంలోనే త‌మ పేరిట ఇంటి స్థలం రిజిష్టర్ చేసుకునే అవ‌కాశం ఏర్పడుతుంద‌ని కరప ఎంపీడీఓ కె.స్వప్న తెలియజేశారు. ఈ మేరకు కరప ఎంపీడీఓ కార్యాలయం నుంచి అన్ని గ్రామసచివాలయ కార్యదర్శిలతోనూ ఆమె టెలీ కాన్పరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, జగనన్న గ్రుహహక్కు పథకాన్ని ల‌బ్దిదారులంతా వినియోగించుకునేలా ల‌బ్దిదారులంద‌రిలో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని గ్రామ స‌చివాల‌య సిబ్బంది, వాలంటీర్లకు ఎంపీడీఓ సూచించారు. అంతేకాకుండా స‌చివాల‌య స్థాయిలో వ‌చ్చే ప్రజా సేవ‌ల‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తుల‌ను త్వర‌గా ప‌రిష్కరించాల‌ని ఆదేశించారు. గ్రామాల్లో అపారిశుధ్యం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు పారిశుధ్య నిర్వహణ చేపట్టాలన్ని సచివాలయ సిబ్బందిని ఈ సందర్భంగా ఎంపీడీఓ ఆదేశించారు.