అల్లూరి స్మారక భవనాలకు మరమ్మతులు చేయాలి..
Ens Balu
13
Kakinada
2021-11-18 10:17:38
శిధిలావస్థకు చేరిన క్రిష్ణదేవీపేటలోని అల్లూరి స్మారక సమాధుల ప్రాంతంలోని భవనాలను ప్రభుత్వం తక్షణమే మరమ్మతులు చేపట్టాలన అల్లూరి యువజన సంగం అధ్యక్షులు పడాల వీరభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కాకినాడలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. 16 అక్టోబర్ 2021న మ్యూజియంలో ఉన్న సీలింగ్ కుప్ప కూలిపోవడంతో అందులో ఉన్న అల్లూరి చిత్రకళాఖండాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని ఆ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఆ సమయంలో అందులో ఎవరూ లేక పెను ప్రమాదం తప్పిందన్నారు.2 నవంబర్ 2021న సమాధులపై ఉన్న శ్లాబు శిధిలం కావడంతో దీని పెచ్చులు క్రిందకు పడ్డాయి. ఆ సమయంలో సందర్శకులు ఎవరూ లేకపోవడం వల్ల ఏ ప్రమాదం జరగలేదన్నారు. ఇలా శిధిలావస్థకు చేరుకున్న చారిత్ర స్మారక భవనాలను నాటి నుంచి నేటివరకూ దానికి కోసం ఎవరూ పట్టించుకోలేదన్నారు. తెల్లవాడిపై పోరాటం చేసి భరతమాత కోసం ప్రాణాలను వదిలిన అల్లూరి, ఆయన గుర్తుగా క్రిష్ణదేవీ పేటలో వున్న స్మారక మందిరాలను ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో అభివ్రుద్ధి చేయాలని ఆ ప్రకటనలో కోరారు. మీడియాకి విడుదల చేసిన ప్రకటనలను రాష్ట్రప్రభుత్వంలోని గిరిజన సంక్షేమశాఖలోని పలు విభాగాల అధికారులకు పంపినట్టు వీరభద్రరావు ఆ ప్రకటనలో తెలియజేశారు.