కాకినాడలో ఘనంగా ఇందిరా గాంధీ 104 జయంతి వేడుకలు..
Ens Balu
13
Kakinada
2021-11-19 09:51:18
ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా భారత ప్రజలకు ఎనలేని సేవలు అందించారని గ్రంథాలయ విశ్రాంత ఉద్యోగి చింతపల్లి సుబ్బారావు అన్నారు. శుక్రవారం కాకినాడ సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘంగా ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ 104వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు తో కలిసి ఆయన మాట్లాడారు. 1966 నుంచి 1977 వరకు వరుసగా 3సార్లు మరియు 1980 లో నాలుగో పర్యాయం ప్రధానమంత్రిగా దేశ ప్రజలకు విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. గరీబీ హటావో నినాదంతో దేశ ప్రజలను ఉత్తేజపరిచారని గుర్తుచేశారు. బ్యాంకులను జాతీయం చేసి చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక సహాయం అందించి వాటి అభివృద్ధికి కృషి చేశారన్నారు. 20 సూత్రాల కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలనకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలుపరిచారని సుబ్బారావు తెలిపారు. అంతకు ముందు ఇందిర చిత్రానికి పూలమాలలు వేసిఘనంగా నివాళులు అర్పించారు.