కాకినాడలో ఘనంగా జాప్ ఆవిర్భావ దినోత్సవాలు..
Ens Balu
13
Kakinada
2021-11-19 11:19:49
జర్నలిస్ట్స్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్(జాప్) 29వ ఆవిర్భావ దినోత్సవాలలో భాగంగా కాకినాడ జెన్టీటియు వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రసాదరాజు,రిజిస్ట్రార్ సుమలత లను తూర్పుగోదావరి జిల్లా శాఖ దుశ్శాలువతో సత్కరించింది. అనంతరం రెడ్ క్రాస్ హోం ఫర్ సీనియర్ సిటిజన్స్ (వృద్దుల అశ్రయం)లో వృద్దులకు,పళ్ళు,పౌష్టికాహార సామగ్రిని పంపిణీ చేసారు.నవసేన పౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాధ పిల్లల సంరక్షణ కేంద్రం,చేయూత స్వచ్చంద సంస్థ నిర్వహిస్తున్న కేంద్రంలో పిల్లలకు పళ్ళు,మిఠాయిలు, పళ్ళు,బిస్కెట్లను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో జాప్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.ఎస్.ఎమ్.కృష్ణంరాజు,రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.ఎన్.ఎస్.కనకాద్రి,శ్రీనివాస వర్మ,గీసాల శ్రీను,జనతా వెంకట్,రాము,దాసరి శ్రీనివాస్,సుధీర్,లతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.