పోలీసులకు ట్రాఫిక్ సేఫ్టీ ఎక్విప్ మెంట్ అందజేత..


Ens Balu
14
Kakinada
2021-11-19 15:46:25

తూర్పుగోదావరి జిల్లా పోలీసు శాఖకు “ట్రాఫిక్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్”ను  సిద్ధాంతం మరియు దివాన్ చెరువు టోల్ వే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా ఎస్పీ కార్యాలయంలో అందజేశాయి. ఈ సందర్బంగా శుక్రవారం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొత్తం కిట్లను ఎస్పీ రవీంధ్రబాబుకి అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలకు సేవలు అందించే పోలీసుల కోసం ఆలోచించి మంచి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.  ట్రాఫిక్ పోలీసులు వేసుకునే రిఫ్లక్టివ్ జాకిట్లు 410, రిఫ్లక్టివ్ టేప్స్ 80 మీటర్లు, కాషన్ టేప్స్ 70రోల్స్, 35 ఫస్ట్ ఎయిడ్ కిట్స్, 35 బోటమ్ లైట్స్, 35 మంచినీటి కూలర్లు, 35 ఎల్ఈడీ టార్చిలైట్లు, 15 మెగా ఫోన్లు అందజేశారు. తమ సంస్థ సిఎస్ఆర్ సేవ కింద వీటిని అందజేసినట్టు నిర్వాహకులు అనిల్ బొమ్మిశెట్టి, తెలియజేశారు. ఈ సందర్భంగా దాతలను ఎస్పీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కరణం కుమార్ తదితరులు పాల్గొన్నారు.