ప్రతినిత్యం సైక్లింగ్ చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొదించుకోవచ్చునని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ నగరంలో గోదావరి సైక్లింగ్ క్లబ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాకినాడ నగరాన్ని సైకిల్ ఫ్రెండ్లీ నగరంగా మార్చేందుకు సైక్లింగ్ ట్రాక్లను విస్తరించనున్నామని, నగర వాసులు ఈ ట్రాక్లను సైక్లింగ్కు వాడుకోవడం ద్వారా తగిన వ్యాయామం జరిగే పలు ఆరోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు అని తెలియజేశారు. కాకినాడ నగరం సైకిల్ ఫర్ చేంజ్ ఛాలెంజ్ కు ఎంపికైన సందర్భంగా ప్రతీ ఒక్కరూ సైక్లింగ్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భావితరాల వారికి కాలుష్య రహిత వాతావరణం అందించేందుకు ఈ సైకిల్ ట్రాక్లు ఎంతో దోహదపడతాయన్నారు. కనుక నగర వాసులంతా ఉత్సాహంగా సైక్లింగ్ లో పాల్గొనాలని చేయాలని విజ్ఞప్తి చేశారు.