ప్రాణిక్ హీలింగ్ తో అద్భుత ఫలితాలు..
Ens Balu
8
Kakinada
2021-11-21 13:27:34
ప్రాణశక్తికి కేంద్రాలుగా ఉన్న ఏడు చక్రాలలో శక్తి ప్రసరణలో అంతరాయం కలిగితేనే రోగాలు వస్తాయని వాటిని ప్రాణిక్ హీలింగ్ చికిత్సతో నివారించవచ్చని ప్రముఖ వైద్య నిపుణురాలు ఎం.వరలక్ష్మి చెప్పారు. ఆదివారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రాణిక్ హీలింగ్ అనేది వ్యాధులను నయం చేసే ఒక ప్రాచీన శాస్త్రీయ వైద్య విధానమని తెలియజేశారు. రోగి శరీరం యొక్క జీవధాతు పదార్థాలన్నీ ప్రాణశక్తిని సరి చేస్తాయని పేర్కొన్నారు. శరీరాన్ని సజీవంగా, ఆరోగ్యవంతంగా ఉంచే జీవ శక్తి లేదా ప్రాణాధార శక్తి ప్రాణశక్తి అని గుర్తు చేశారు. ప్రాణా లేదా జీవనాధార శ్వాసను రోగి శరీరంలోకి ప్రసరింపజేయడంతో రోగికి పూర్తి స్వస్థత చేకూరుతుందని వరలక్ష్మి వివరించారు. ఈ కార్యక్రమంలో బోట్ క్లబ్ నిర్వాహకులు అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.