ఉత్సాహంగా భగవద్గీత శ్లోకాల కంఠస్థ పోటీలు..
Ens Balu
8
Kakinada
2021-11-21 13:31:03
కాకినాడ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం జగన్నాదపురం సామా పబ్లిక్ స్కూల్ మరియు గాంధీనగరం మునిసిపల్ హైస్కూల్ లోను ప్రఖండస్తాయి భగవద్గీత కంఠస్థం పోటీలు నిర్వహించినట్టు జిల్లా ప్రముఖ్ లు గరిమెళ్ళ అన్నపూర్ణయ్య శర్మ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మయోగం పై జరిగిన ఈ పోటీలలో రెండుచోట్ల 150మంది పోటీదారులు పాల్గొన్నారని తెలియజేశారు. ఈ పోటీల్లో మొదటి మూడు స్థానాలకు ఎంపిక చేయబడ్డవారిని జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్టు వివరించారు. న్యాయ నిర్ణేతలుగా దుర్గాప్రసాద్, బి.శ్యాంసుందర్, డా.రమాదేవి, శ్రీమన్నారు, రవి వర్మ, మంగామని లు వ్యవహరించారని చెప్పారు. కార్యక్రమంలో ఆర్.రవిశంకర్ పట్నాయక్, సహకార్యదర్శి ఉదయ్ భానోజి, ప్రఖండ ఇంచార్జ్ లు బచ్చు మహాలక్ష్మి, శ్రీకృష్ణ వాణి,ఈమని పరమేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.