పోషకాల గని కోడి గుడ్డు.. బాలల సంక్షేమ అధికారి వెంకట్రావు..


Ens Balu
4
Kakinada
2021-11-21 13:34:35

కోడిగుడ్డులో అధిక పోషకాలు ఉన్నందున ప్రభుత్వం కూడా అంగన్వాడి కేంద్రాల ద్వారా బాలలకు పోషకాహారంగా అందిస్తుందని జిల్లా బాలల సంక్షేమ అధికారి సిహెచ్. వెంకట్రావు పేర్కొన్నారు. కాకినాడలోని  సర్పవరం జంక్షన్ లో లయన్స్ క్లబ్ కాకినాడ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో కోడిగుడ్లు పంపిణీ చేపట్టారు. వెంకటరావు మాట్లాడుతూ, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కూడా ప్రభుత్వం రోజూ కోడిగుడ్డు ఇస్తుందని తెలియజేశారు. డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ, కోడి గుడ్డు లో ఆరు గ్రాముల ప్రోటీన్లు, 14 రకాల పోషక పదార్థాలు ఉన్నాయన్నారు.  అందుచే ప్రతి ఒక్కరు  రోజుకొక గుడ్డును ఆహారంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ద్వారంపూడి అవినాష్ రెడ్డి,  న్యాయవాది యనమల రామం,  సంఘం నిర్వాహకులు అడబాల రత్న ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.