కకనకదాసు చూపిన జ్ఞాన మార్గంలో నడవాలి-జిల్లా కలెక్టర్


Ens Balu
2
Vizianagaram
2021-11-22 14:22:48

భక్త కనకదాసు వెనుకబడిన కులం లో, కడు పేద కుటుంబం లో జన్మించిమప్పటికి గొప్ప తత్వ వేత్తగా ఎదిగిన  వ్యక్తి యని ఆయన చూపిన జ్ఞాన మార్గం లో అందరూ నడవాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లో భక్త కనక దాసు జయంతిని ఘనంగా నిర్వహించారు.  జిల్లా కలెక్టర్ సూర్య కుమారి, సంయుక్త కలెక్టర్లు డా.జి.సి.కిషోర్ కుమార్, డా.మహేష్ కుమార్, జె.వెంకట రావు, డి.ఆర్.ఓ గణపతి రావు  లు  తొలుత జ్యోతిని వెలిగించి    కనక దాసు చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కన్నడ భాష లో అనేక కీర్తనలను రచించిన కనక దాసు  గొప్ప భక్తుడు,  ఆధునిక కవి, తత్వ వేత్త, సంగీత కళాకారుడని కలెక్టర్ పేర్కొన్నారు. వందేళ్లు జీవితాన్ని గడిపిన  వ్యక్తి అసలు కులమనేదే లేదనే తత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారని తెలిపారు. తక్కువ కులం లో పుట్టారని కృష్ణుని ఆలయం లోనికి పూజారులు ప్రవేశించ నీయలేదని, ఆయన భక్తికి  తార్కాణం గా  కృషునిని దర్శన భాగ్యం లభించిందని, అంతటి భక్తి పరాయనత గలా వారని పేర్కొన్నారు. నిజాయితీ గా వ్యవరించే వారికి ఎప్పటికైనా మంచే జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం లో డి ఆర్ డి ఎ. పి.డి డా. అశోక్ కుమార్, పశు సంవర్ధక శాఖ జె.డి డా.రమణ, మెప్మా పిడి సుధాకర్, డిడి ఫిషరీస్ నిర్మలా కుమారి, సమగ్ర శిక్షా పి.డి స్వామి నాయుడు,  బి.సి సంక్షేమ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భ0గా  కనక దాసు రచించిన కన్నడ  కీర్తన ను మహారాజా సంగీత కళాశాల విద్యార్థులు హృద్యంగా ఆలపించారు.