వాహన దారుల పట్ల జిల్లా ఎస్పీ దాత్రుత్వం..
Ens Balu
7
Kakinada
2021-11-23 02:56:11
ఐపీఎస్ అధికారులంటే కేవలం కింది స్థాయి అధికారులు, సిబ్బందికి విధి నిర్వహణ కేసుల విధించే విషయంలో ఆదేశాలు జారీచేయడం చూసిన వాహనదారులకు..అదే ఐపీఎస్ అధికారులు తలచుకుంటే అదే వాహన దారుల ఇబ్బందులను కూడా అదే స్థాయిలో పట్టించుకోవడం తూర్పుగోదావరి జిల్లాలో కళ్లకి కట్టినట్టు కనిపించింది. అవును తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు అనపర్తి నుంచి రాజానగరం వెళ్లే రోడ్డు చిద్రమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడటం మీడయా కధనాల ద్వారా తెలుసుకుని అక్కడి పోలీసు సిబ్బంది ఈ విషయం తెలియజేశారు. దీనితో రామచంద్రాపురం డిఎస్పీ పర్యవేక్షణలో సిఐ ఎన్వీ భాస్కర్ అనపర్తి నుంచి రాజానగరం వెళ్లే రోడ్డుతో పాటు ఇంకొన్ని రోడ్లపై పడ్డ గుంతలను తన సిబ్బందితో క్వారీ రాయి గుండతో కప్పించారు. ఈ పనికి పోలీస్ సిబ్బంది శ్రమధానంతో ఇదంతా చేపట్టారు. మనసున్న అధికారి ఇలాంటి సేవచేసే పనులు అప్పగిస్తే పోలీసు సిబ్బంది అంతే నిబద్ధతో ఏ విధంగా చేస్తారో ఈ శ్రమధానంతో నిరూపితమైంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు, అదే ప్రజలు ప్రయాణాల్లో ఇబ్బందులు పడుతున్నా చూస్తూ ఊరుకోరని తూర్పుగోదావరి జిల్లా పోలీసు నిరూపించి, గుంతలు పడిన రోడ్డును బాగుచేసి చూపించారు. ఖాకీలు చేసిన ఈ సేవకు వాహనదారులు ఫిదా అవుతున్నారు. ఈ అంశం ఇపుడు జిల్లాలోనే చర్చనీయాంశం అవుతుంది.