సమాజసేవే సత్య సాయిబాబా లక్ష్యం..
Ens Balu
7
Kakinada
2021-11-23 07:53:33
ప్రపంచ దేశాలలో లక్షలాదిమంది హృదయాలలో పిలిస్తే పలికే దైవం గా నిలిచిన సత్య సాయి బాబా తుది శ్వాస వరకు సమాజసేవే తన ఊపిరిగా సేవలు అందించారని ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ సర్పవరం జంక్షన్ లో బోటు క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో సత్య సాయి బాబా 96 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంద్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్నాయక్ మాట్లాడుతూ 1926 నవంబర్ 23న సత్య సాయిబాబా జన్మించారని అన్నారు. మానవ సేవే మాధవ సేవగా భావించి విద్య, వైద్య, తాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. వీరభద్రరాజు మాట్లాడుతూ మతాలు, కులాలు, ప్రాంతాలు, వర్గాలు, దేశాల కతీతంగా సాయి భక్తులు సేవా మార్గంలో పయనిస్తున్నారన్నారు. భక్తుల మనస్సుల్లో సానుకూల దృక్పథం తీసుకురావడం ద్వారా ఆదర్శవంతమైన సమాజ నిర్మాణానికి సత్య సాయి బాబా బాటలు వేశారని కొనియాడారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ నిర్వాహకులు అడబాల రత్న ప్రసాద్ ,బాపిరాజు, రాఘవ రావు తదితరులు పాల్గొన్నారు.