సింహగిరిపై వరుస పండుగలు,భారీ ఏర్పాట్లు.. ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు
Ens Balu
3
Simhachalam
2021-12-04 08:16:36
ఉత్తరాంధ్రాజిల్లాల్లోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలంలోని సింహగిరిపై వరుస పండుగుల తాకిడి నెలకొనబోతుంది. ఈ నేపథ్యంలో భక్తులు కూడా అదేస్ధాయిలో ఐదు రోజుల పాటు సింహచలం శ్రీ వరహా లక్ష్మీ నృసింహ స్వామిని దర్శించుకోవడానికి తరలిరానున్నారు. ఈ మేరకు శనివారం సింహచలం దేవస్దానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు సింహాద్రినాథుడు, క్షేత్రపాలకుడైన త్రిపురాంతక స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా కాలం తరువాత సంక్రాంతితో కలిపి ఈ ఏడాది అప్పన్న ఉత్తరద్వార దర్శనం భక్తులకు లభించనుందన్నారు. ఆరోజున ఉత్తర ద్వారంలో కొలువున్న అప్పన్నను దర్శించుకుంటే సాక్షాత్తు వైకుంఠంలో కొలువున్న శ్రీమన్నారాయణనుడిని దర్శించుకున్నంత పుణ్యఫలం కలుగుతుందన్నది అప్పన్న భక్తకోటి ప్రగాడ విశ్వాసంగా శ్రీనుబాబు వివరించారు. జనవరి12న అప్పన్న ఉత్తర ద్వార దర్శనం(ముక్కోటి ఏకాదశి), 13న భోగి,14న సంక్రాంతి,15న కనుమ పండుగులు రానున్నట్లు చెప్పారు. 16న ముక్కోనమ పండుగ ఘనంగా జరుపుకోనున్నారన్నారు. అయితే ఆయా పండగుల నేపథ్యంలో సంక్రాంతి పర్వదినం రోజున అప్పన్న మకరవేట ఉత్సవాన్ని(గజేంద్ర మోక్షం) ఘనంగా నిర్వహించేందుకు ఆలయ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీనుబాబు చెప్పారు. ఆయా పండుగ రోజుల్లో భక్తులకు కనువిందు చేసే విధంగా సింహాద్రినాధుడి ఆలయ ఈవో ఎంవీ సూర్యకళ ఆధ్వర్యంలో సిబ్బంది భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఐదు రోజుల పాటు వరుస పండుగల నేపథ్యంలో భక్తులంతా స్వామిని దర్శించుకుని సేవించి,తరించాలని శ్రీనుబాబు విజ్ఞప్తి చేశారు.