సచివాలయ పరీక్షలు సజావుగా నిర్వహించాలి..జెసి
Ens Balu
3
Bheemili
2020-09-14 20:22:54
విశాఖజిల్లాలో సచివాలయ ఉద్యోగ పోటీ పరీక్షల నిర్వహణ సజావుగా జరగాలని నోడల్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశిం చా రు. సోమవారం 2 వ క్లస్టర్ లోని భీముని పట్నం మండలం లోని 6 పరీక్షా కేంద్రాల ను తనిఖీ చేసి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన భీమిలి లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సెయింట్ ఆన్స్ పబ్లిక్ స్కూలు, అమేయ పబ్లిక్ స్కూలు, చిట్టి వలస లోని శారదా పబ్లిక్ స్కూలు, జిల్లా పరిషత్ హైస్కూలు, కుమ్మ రిపాలెం లోని తిరుమల హైస్కూలు పరీక్షా కేంద్రాల ను సందర్శించారు. ఈ కేంద్రాలలో ఫర్నీచర్, విద్యుత్ సౌకర్యం, త్రాగునీరు, మరుగుదొడ్లు, శానిటేషన్ లను పరిశీలించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించాలని తెలిపారు. అభ్యర్థుల ను తనిఖీ చేసే గదులను, సామానులు భద్రపరిచే గదులను పరిశీలించారు. అనంతరం భీమిలి పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమును సందర్శించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, సిసిటీవీ ల నిఘా పటిష్టం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమిలి జోనల్ కమీషనర్ సీహెచ్ గోవింద రావు, తహసీల్దార్ వెంకటేశ్వర రావు, యంపీడీఓ వెంకట రమణ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.