సేంద్రియ రైతులకు జీవీఎంసీ నుంచి అన్ని విధాల సహకారం..
Ens Balu
8
Visakhapatnam
2021-12-05 15:45:46
విశాఖ జిల్లాలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులకు మహా విశాఖ నగర పాలక సంస్థ నుంచి ఏ రకమైన సహాయం చేయాలో ఆలోచించి కార్యాచరణతో ముందుకు వస్తానని నగర పాలక సంస్థ కమిషనర్ లక్ష్మీ షా హామీ ఇచ్చారు. ఆర్గానిక్ మేళాలో పాల్గొన్న స్థానిక రైతుల వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి వారి మార్కెటింగ్ మెరుగుపరిచే ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. ఆదివారం సాయంత్రం ఆర్గానిక్ మేళా ను సందర్శించిన ఆయన అరగంట సేపు అన్ని షాపులను సందర్శించి ఏ ఏ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయో తెలుసుకున్నారు. 22 వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కండువా కప్పి ఆయనకు స్వాగతం పలికారు. మేళాలో ఉత్తమ స్టాల్ గా ఎంపికైన సెంట్రల్ జైలు దుకాణం సిబ్బందికి ఆయన జ్ఞాపికను అందజేశారు. ఇంత పెద్ద ఎత్తున వైవిధ్యభరితమైన ఉత్పత్తులతో సేంద్రీయ ఆహార ఉత్పత్తుల మేళా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మేళా కమిటీ కార్యదర్శి ఎం. యుగంధర్ రెడ్డి , జే వీ రత్నం, కన్వీనర్ జలగం కుమారస్వామి, జి ఎస్ ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.