భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను జాతి ఎప్పుడూ మరిచి పోదని, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు కొనియాడారు. సోమవారం డా.బీఆర్ అంబేత్కర్ వర్ధంతి సందర్భంగా డాబాగార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్లిర్పించారు. ఈ సందర్భంగా గంట్ల మాట్లాడుతూ, అంబేత్కర్ రచించిన భారత రాజ్యంగం బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి మార్గదర్శకం అయ్యిందన్నారు. భారత దేశానికి అంబేద్కర్ అందించిన సేవలు మరపు రానివని అన్నారు. అంభేత్కర్ ఆశయాలను నేటి యువత స్పూర్తిగా తీసుకోవాలని గంట్లశ్రీనుబాబు సూచించారు.