కార్తీక మాసం మొదలుకొని 45 రోజులపాటు అయ్యప్పలు ఎన్నో నియమాలతో స్వామీ దీక్ష పూర్తిచేస్తారని ఆ సమయంలో ఒక్కసారైనా అయ్యప్పలు అంబలం పూజనిర్వహించుకొని స్వామి కటాక్షాలు పొందుతారని సింహాచలం దేవస్ధానం ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు అన్నారు. సోమవారం అన్నారు. ఎంతో దీక్షతో ఎన్నో నియమాలతో విశాఖలోని కంచరపాలెం ధర్మానగర్ ప్రాంతంలో మళ్ల కిరణ్‌స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన అంబలం పూజలో గంట్ల శ్రీనుబాబు పాల్గొని అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాల ధారణలో అయ్యప్పమాలకు విశేష గౌరవం వున్నదన్నారు. అలాంటి స్వాముల సమూహంలో జరుగుతున్న అంబలం పూజలో పాల్గొనడం ఆ అయ్యప్ప కరుణగా భావిస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు అప్పలనాయుడు, సత్తిబాబు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.