శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారికి కి గంట్ల పూజలు..
Ens Balu
4
Visakhapatnam
2021-12-06 17:00:19
ఆధ్యాత్మిక భక్తిభావంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని సింహాచలం దేవస్ధానం ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు అన్నారు. సోమవారం శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం శ్రీనుబాబు మార్గశిరమాస ఏర్పాట్లును పరిశీలించి ఆలయ సిబ్బందిని ప్రసంశించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి తరలిరానున్న నేపథ్యంలో ఆలయ వర్గాలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే భక్తులకు సులభతరంగా అమ్మవారి దర్శనం కల్పించడానికి అవకాశం కలుగుతుందన్నారు. తొలి గురువారం సందర్భంగా పలు స్వచ్చంద సంస్థలు భక్తులకు సేవలందించాలని ఆయన ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.