ప్లాస్మదాతలూ మీకు మా సలాం...


Ens Balu
2
Srikakulam
2020-09-14 20:30:10

ప్లాస్మా దానకర్తలకు ప్రతి ఒక్కరూ సలాం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అన్నారు. ప్రస్తుతం ప్లాస్మా దానకర్తలు కోవిడ్ ను పారద్రోలుతున్నారని, అనేక మంది ప్రాణాలు నిలుపుతున్నారని కొనియాడారు. ప్లాస్మా దానానికి కోవిడ్ వారియర్స్ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్లాస్మా దానం చేసిన యువత నిర్ణీత గడువు తరువాత కూడా దానం చేయుటకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేసారు. కరోనా భారీన పడిన వారు మన కుటుంబీకులు, బంధువులు, స్నేహితులే అని గుర్తించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ప్లాస్మా దానం చేసిన యువత - వి.మురళి కృష్ణ, ప్రశాంత్ పాత్రో,దుప్పల సతీష్ కుమార్,ఇతికర్లపల్లి మహేష్ కుమార్, ఆడిదెల శామ్యూల్,వంటకుల సూర్య నారాయణ మూర్తి,బొర్రా నాగరాజు,ఆర్ వెంకటరమణ, పి వెంకటేష్, ఎస్ చంద్రశేఖర్,కింజరాపు భాస్కర రావులకు ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందజేసారు.  ఈ కార్యక్రమంలో కోవిడ్ సూపరింటెండెంట్ డాక్టర్ హేమంత్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి రామ్మోహన్, కిమ్స్ డైరెక్టర్ డాక్టర్ సోమేశ్వర రావు,డాక్టర్ సుధీర్ కుమార్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ జెమ్స్ ప్రిన్సిపాల్ లక్ష్మీ లలిత, ఆర్ఎంఓ డాక్టర్ బాలమురళి, డిప్యూటీ అర్ఎంఓ డాక్టర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు