"సంపూర్ణ గృహ హక్కు" రిజిస్ట్రేషన్లు వేగం పెంచాలి..


Ens Balu
6
Visakhapatnam
2021-12-13 11:51:24

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో లబ్ధిదారులకు శాశ్వత గృహ హక్కు కల్పించే రిజిస్ట్రేషన్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్  డా. ఏ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాలోని అన్ని మండలాల, తాహసిల్దార్ లు, ఎంపీడీవోలు, జీవీఎంసీ జోనల్ కమిషనర్ లతో ఈ విషయమై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంపూర్ణ గృహ హక్కు పట్టాలను కలిగి ఉన్నట్లయితే చేకూరే లాభాలను లబ్ధిదారులకు తెలియజేసి పూర్తి అవగాహన కల్పించాలన్నారు.  రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ముందుకు వచ్చిన వారికి వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన   అవకాశం వినియోగించుకో 
వాలన్నారు.  రిజిస్ట్రేషన్ చేసే  విధివిధానాలను గూర్చి జిల్లా రిజిస్ట్రార్ అధికారులకు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొనగా కలెక్టర్ కార్యాలయం నుండి జెసి  ఎం.వేణుగోపాల్ రెడ్డి, హౌసింగ్ జెసి కల్పనా కుమారి, గృహ నిర్మాణ శాఖ పి డి శ్రీనివాస్, ఇన్ఛార్జ్ డిఆర్ఓ రంగయ్య, జడ్పీ సీఈఓ నాగార్జునసాగర్, వివిధ మండలాల గృహనిర్మాణ శాఖ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.